Sun Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. అదే విధంగా సూర్యుడి ఇప్పటికే తులారాశిలో అక్టోబర్ 17న ప్రవేశించాడు. తిరిగి నవంబర్ 17 వరకూ సూర్యుడు ఇదే రాశిలో కొనసాగనున్నాడు. ఫలితంగా కొన్ని రాశులపై ఊహించని విధంగా కనకవర్షం కురవనుంది. ఆ వివరాలు మీ కోసం..
గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి జ్యోతిష్యశాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. గ్రహాల రారాజుగా పిలిచే సూర్యుడు బుధుడి రాశి కన్యాలో ఉన్నాడు. ఇప్పుడు తులా రాశిలో ప్రవేశించాడు. తులా రాశిలో సూర్యుడు నవంబర్ 17 వరకూ కొనసాగనున్నాడు. ఫలితంగా మకరం, కుంభం, మీన రాశుల జీవితాల్లో పెను మార్పులు రానున్నాయి. ఆ మార్పులేంటో పరిశీలిద్దాం.
కుంభ రాశి జాతకులకు సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావంతో ఊహించని లాభం కలగనుంది. సూర్యుడు నవంబర్ 17 వరకూ తులా రాశిలో ఉండటం వల్ల అదృష్టం తోడై నిలుస్తుంది. మరోవైపు 30వ తేదీన చాలా గ్రహాలు ఇదే స్థానంలో ఉండటం వల్ల ఈ రాశి జాతకులకు వృద్ధి, ఆదాయం పెంపు వంటివి ఉంటాయి. నవరాత్రిలో దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవాలి. దుర్గాదేవి ఆశీర్వాదంతో జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార వర్గాలకు అంతులేని దనలాభం కలగనుంది.
మీన రాశి జాతకులకు ఈ సమయంలో అత్యంత శుభసూచకమైన పరిణామాలు కలుగుతాయి. జీవిత భాగస్వామికి సంబంధించిన పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఊహించని ధనలాభం కలగడంతో ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. కుటుంహ సభ్యులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం పట్ల ముఖ్యంగా ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా గతంలో ఏదైనా డబ్బులు నిలిచిపోయుంటే ఆ డబ్బులు చేతికి అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది.
ఇక మకర రాశి జాతకులకు సూర్యుడి గోచారం అద్భుతమైన లాభాల్ని తెచ్చిపెట్టనుంది. ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు ఎదురౌతాయి. ఆస్థి,ఇళ్లు కొనుగోలు వ్యవహారాల్లో సంబంధిత పేపర్ల జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. లేకపోతే సమస్యలు చుట్టుకోవచ్చు. ఈ రాశివారికి అక్టోబర్ 30 వరకూ సమయం చాలా బాగుంటుంది.
Also read: Dussehra 2023: దసరా ఎప్పుడు? రావణ దహనం ఏ సమయంలో చేయాలి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook