Sun Transit 2023: మరో 5 రోజుల్లో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. ఇందులో మీరున్నారా?

Sun Transit 2023: సాధారణంగా సూర్య సంచారాన్ని సంక్రాంతి అంటారు. మరో ఐదు రోజుల్లో సూర్యదేవుడు కుంభరాశిలో సంచరించనున్నాడు. దీని వల్ల మూడు రాశులవారు అపారమైన సంపదను పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2023, 12:59 PM IST
Sun Transit 2023: మరో 5 రోజుల్లో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. ఇందులో మీరున్నారా?

Sun Transit 2023: వేద జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. మరో 5 రోజుల్లో అంటే ఫిబ్రవరి 13, ఉదయం 9.57 గంటలకు సూర్యభగవానుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే కుంభ సంక్రాంతి అంటారు.  సూర్యుడి సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. సూర్యుడి రాశి మార్పు వల్ల ఏ రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. 

సూర్య సంచారం ఈ రాశులకు వరం
వృషభం (Taurus) - సూర్యుని సంచారం వృషభ రాశి వారిపై శుభ ప్రభావం చూపుతుంది. నిరుద్యోగులు కొత్త జాబ్ పొందే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఎదురుచూసున్న అవకాశాలను  ఇప్పుడు అందిపుచ్చుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 
కన్యారాశి (Virgo)- సూర్యుని రాశి మార్పు కన్యారాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు తీసుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. 
ధనుస్సు (Sagittarius)- కుంభరాశిలో సూర్యుని ప్రవేశం ధనుస్సు రాశి వారికి చాలా మేలు చేస్తుంది.  ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.  కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. మీ కెరీర్ లో ఉన్నత శిఖరాలను  అధిరోహిస్తారు. 

Also Read: Budh Gochar 2023: రాబోయే నెల రోజులు పాటు ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News