Sun Transit 2022: సూర్యుడి తుల రాశి ప్రవేశం, అక్టోబర్ 17 నుంచి ఆ రాశి వారికి ముట్టుకున్నదంతా బంగారమే

Sun Transit 2022: సూర్యుడి రాశి పరివర్తనం ఆ రాశివారికి లాభాలు చేకూర్చనుంది. ఇంటా, బయటా, ఆఫీసులో మీకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగస్థులకు పదోన్నతి ఖాయం. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 13, 2022, 05:59 PM IST
Sun Transit 2022: సూర్యుడి తుల రాశి ప్రవేశం, అక్టోబర్ 17 నుంచి ఆ రాశి వారికి ముట్టుకున్నదంతా బంగారమే

చరాచర సృష్టిలోని గ్రహాలు వివిధ రాశుల్లో ప్రవేశిస్తుంటాయి. జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం విశేషంగా ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశులపై అనుకూలంగా, మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. సూర్యుడి రాశి పరివర్తనం ఆ రాశివారిపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

సూర్యుడు తులా రాశిలో అక్టోబర్ 17న ప్రవేశించనున్నాడు. అంటే దీపావళికి ముందే సూర్యుడి రాశి పరివర్తనం జరగనుంది. సూర్యుడు తులా రాశిలో ప్రవేశించడం వల్ల కర్కాటక రాశిపై అనుకూల ప్రభావం పడనుంది. కర్కాటక రాశి జాతకులకు కలగనున్న ప్రయోజనాలు తెలుసుకుందాం..

సూర్యుడి రాశి పరివర్తనం కర్కాటక రాశికి అనుకూలంగా ఉంటుంది. ఇంటా, బయటా, ఆఫీసులో అన్ని చోట్లా మీ సామర్ధ్యంపై మీకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగస్థులకు పదోన్నతి ఖాయం. ఇంకా ఇతర శుభవార్తలు వింటారు. మీరు పడిన శ్రమపై మిమ్మల్ని ప్రశంసించవచ్చు. మీ వాయిస్, మీ వ్యవహారశైలి మీకు లాభించనుంది. ఫలితంగా మీకు పెద్ద పెద్ద అధికారులతో సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారులకు పెద్ద డీల్స్ చేతికి అందనున్నాయి. కాంట్రాక్ట్ టెండర్లు ఆమోదం పొందడంతో అధిక లాభాలు ఆర్జిస్తారు. ఫలితంగా వ్యాపారం వృద్ధి చెందుతుంది. అంతులేని ధనం లభిస్తుంది. పోటీ పరీక్షలకు సన్నద్దమౌతున్న విద్యార్ధులకు విజయం లభిస్తుంది. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం లభించవచ్చు.

కుటుంబసభ్యులు అప్పగించిన బాధ్యతల్ని సమర్ధవంతంగా నిర్వహిస్తారు. పెద్దల ఆశీర్వాదం పిల్లల ప్రేమ లభిస్తాయి. కుటంబంలో మీ తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. వ్యాధిని నిర్లక్ష్యం చేయవద్దు. కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి. కర్కాటక రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. స్మోకింగ్ చేసే అలవాటుంటే..వెంటనే మానేయడం మంచిది. దుమ్ము ధూళికి దూరంగా ఉండాలి. ఆపన్నులకు, పేదలకు సహాయం చేయడం అలవాటు చేసుకోండి.

Also read: Moles In Astrology: శరీరంలో ఈ భాగాల్లో పుట్టు మచ్చలుంటే నిజంగా మీరు అదృష్టవంతులే.. వీరికి డబ్బే డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News