Sun Transit 2022: మేష రాశిలోకి సూర్యుడు... ఆ 3 రాశుల వారికి అంతా శుభమే..

Sun Transit Effect: సూర్య గ్రహం ఈ నెల 14న రాశిచక్రం మారింది. ఈ ప్రభావం కొన్ని రాశుల వారికి సానుకూల ప్రయోజనం కలగజేయనుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2022, 11:17 AM IST
  • ఈ నెల 14న మేష రాశిలోకి సూర్యుడు
  • మే 14 వరకు మేష రాశిలోనే సూర్యుడు
  • ఆ 3 రాశుల వారిపై సూర్య భగవానుడి ప్రభావం
Sun Transit 2022: మేష రాశిలోకి సూర్యుడు... ఆ 3 రాశుల వారికి అంతా శుభమే..

Sun Transit Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతీ గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో రాశిచక్రం మారుతుంది. ఈ నెల 14న సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశించాడు. మే 14 వరకు మేషరాశిలోనే సంచరిస్తాడు. ఇది కొంతమందికి అన్ని విధాలా కలిసొస్తుంది. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, బంధాల పరంగా అంతా మంచే జరుగుతుంది. సూర్య సంచారంతో ఏయే రాశుల వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం... 

మేషరాశి (Aries)

సూర్య ప్రభావంతో మేష రాశి వారికి సంపద పెరుగుతుంది. వృత్తిపరంగా లాభాలను చవిచూస్తారు. కొత్త ఉద్యోగ అవకాశం దొరుకుతుంది. కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సంతాన భాగ్యం కలుగుతుంది. చేపట్టే ప్రతీ పని విజయంతో ముగుస్తుంది. వృత్తిపరంగా, కుటుంబపరంగా సాఫీ జీవితం గడుపుతారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహాయ, సహకారాలు, పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

కర్కాటక (Cancer)

సూర్యుడు రాశి మారినందువల్ల ఆ ప్రభావం కర్కాటక రాశి వారిపై ఉంటుంది. ఈ కాలంలో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన ఏ పనైనా సులువుగా పూర్తి చేస్తారు. సూర్య భగవానుడి అనుగ్రహంతో ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. పరిశోధన, ఉన్నత విద్య అభ్యసించే వారికి పూర్తి అనుకూల సమయం. వారు ఏదైనా సాధించవచ్చు. కెరీర్‌లో పురోగతి ఉంటుంది. 

తుల రాశి   (Libra)

సూర్య భగవానుడి ప్రభావంతో తుల రాశి వారికి అంతా శుభమే జరుగుతుంది. కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు, పదోన్నతి లభించవచ్చు. అనుకోని ప్రయాణాలు కూడా కలిసొస్తాయి. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. ఇతరులకు ఇచ్చే స్థానంలో ఉంటారు తప్ప ఆశించరు. 

మీనరాశి (Psices)

సూర్య భగవానుడి అనుగ్రహంతో మీన రాశివారికి సంపద సిద్ధిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడి సంపద పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. పెట్టుబడుల్లో లాభాలను చవిచూస్తారు. కీలక నిర్ణయాలు కలిసొస్తాయి. చేపట్టిన ప్రతీ పని సానుకూల వాతావరణంలో పురోగతితో ముందుకు సాగుతుంది. 

Also Read: Tatineni Ramarao: దిగ్గజ సినీ దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూత.. అప్పట్లోనే ఆయనది ప్యాన్ ఇండియా రేంజ్..

Also Read: Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ తదుపరి టార్గెట్ కర్ణాటకే, ఇవాళ కీలక సమావేశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News