Surya Gochar 2024: జనవరి 15న మకరంలోకి సూర్యుడు.. ఈ 2 రాశులకు లాభాలు బోలెడు..

Makar Sankranthi 2024: సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారు. ఈ అరుదైన ఘట్టం వచ్చే జనవరి నెలలో ఏర్పడబోతుంది.  ముఖ్యంగా సూర్యుడి సంచారం రెండు రాశులవారికి కలిసి రానుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2023, 01:24 PM IST
Surya Gochar 2024:  జనవరి 15న మకరంలోకి సూర్యుడు.. ఈ 2 రాశులకు లాభాలు బోలెడు..

Surya Gochar in Makar rashi 2024: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. న్యూ ఇయర్ లో కూడా కొన్ని గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. గ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు జనవరి 15, 2024 మధ్యాహ్నం 2.32 గంటలకు మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. దీనినే మకర సంక్రాంతి అంటారు. ఆస్ట్రాలజీలో సూర్యుడిని విజయం మరియు గౌరవానికి కారకుడిగా భావిస్తారు. మకరరాశిలో సూర్యుడి సంచారం ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉండనుందో తెలుసుకుందాం. 

మేష రాశి 
సూర్యుడి సంచారం మేష రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. జనవరిలో ఈ రాశి వారి సంపద పెరుగుతుంది. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు లక్ కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.  మేష రాశి వారు సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతిరోజూ 19 సార్లు 'ఓం సూర్యాయ నమః' అని మంత్రాన్ని పఠించండి. 
వృషభ రాశి
మకరరాశిలో సూర్యుని సంచారం వృషభ రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. మీ కెరీర్  లో ఎదుగుదల ఉంటుంది. అనారోగ్యం నుండి బయటపడతారు. జాబ్ కోసం ఎదురుచూసేవారి కోరిక నెరవేరుతుంది. ఈ సమయంలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆగిపోయిన పనులు తిరిగి మెుదలవుతాయి. నీటితో సూర్యుడికి ఆర్ఘ్యమిస్తే ఆ దేవుడు అనుగ్రహం మీకు లభిస్తుంది. 

Also Read: Rahu-Ketu Transit 2024: రాహు కేతువుల ప్రభావం, ఆ మూడు రాశులకు కొత్త ఏడాదిలో ఎలా ఉంటుందంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News