Sravanam 2022: శ్రావణ మాసం మొదటి ప్రదోష వ్రతం ఎప్పుడు? ముహూర్తం, పూజ విధానం, ప్రాముఖ్యత

Sawan Pradosh Vrat 2022: ఈ సంవత్సరం శ్రావణ మొదటి ప్రదోష వ్రతం జూలై 25న వస్తుంది. అంతేకాకుండా ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగంలో చేసే పూజలు మీకు రెట్టింపు ఫలాన్నిస్తాయి. శ్రావణ మొదటి ప్రదోష వ్రతం గురించి తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2022, 12:53 PM IST
  • మరో వారం రోజుల్లో ప్రదోష వ్రతం
  • ఈ రోజున శివుడిని పూజిస్తారు
  • ఈ వ్రత ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి
Sravanam 2022: శ్రావణ మాసం మొదటి ప్రదోష వ్రతం ఎప్పుడు? ముహూర్తం, పూజ విధానం, ప్రాముఖ్యత

First Sravana Pradosh Vrat 2022:  శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి తిథి నాడు తొలి శ్రావణ ప్రదోష వ్రతాన్ని (First Sawan Pradosh Vrat 2022) పాటించనున్నారు. ఇది ఈసారి జూలై 25, సోమవారం నాడు వస్తుంది. ప్రతి నెల త్రయోదశి తిథి నాడు ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ రోజున శివారాధన చేస్తే..మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. ప్రదోష వ్రత పూజ ముహూర్తం, యోగాలు మొదలైన వాటి గురించి తెలుసుకుందాం. 

ప్రదోష వ్రతం 2022 తేదీ
పంచాంగం ప్రకారం, శ్రావణ కృష్ణ పక్షం యొక్క త్రయోదశి తేదీ జూలై 25, సోమవారం సాయంత్రం 04:15 నుండి ప్రారంభమై...  జూలై 26, మంగళవారం సాయంత్రం 06:46 గంటలకు ముగుస్తుంది. శివపూజ ముహూర్తం జూలై 25న ఉండటంతో ఆరోజే ప్రదోష వ్రతాన్ని నిర్వహిస్తారు. 

పూజ ముహూర్తం
జూలై 25 న సోమ ప్రదోష పూజకు సాయంత్రం 07.17 నుండి రాత్రి 09.21 వరకు అనుకూల  సమయం. ఈ రోజున శివారాధనకు 2 గంటలకు పైగా సమయం ఉంటుంది. 

సర్వార్థ సిద్ధి యోగ సమయం
శ్రావణ మాసం మొదటి సోమవారం రోజున సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి.ఈ రెండు యోగాలు జూలై 25న ఉదయం 05:38 గంటలకు ప్రారంభమై రాత్రి 01:06 గంటలకు ముగుస్తాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 12.55 గంటల వరకు శుభ సమయం ఉంటుంది. ఈ రోజు రాహుకాలం ఉదయం 07.21 నుండి ఉదయం 09.03 వరకు ఉంటుంది. ప్రదోష వ్రతం ఆరాధన సాయంత్రం అయినందు వల్ల రాహుకాలం చూడవలసిన అవసరం లేదు. 

ప్రదోష వ్రతం ప్రాముఖ్యత
ప్రదోష వ్రతం ఆచరించడం వల్ల సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధాన్యాలు, ఆనందం, శాంతి మొదలైనవి లభిస్తాయి. పుత్ర సంతానం కోసం శని ప్రదోష వ్రతం పాటిస్తారు. కోరికల నెరవేర్చుకోవడానికి సోమ ప్రదోష వ్రతం చేస్తారు.

Also Read: Kamika Ekadashi 2022: ద్విపుష్కర యోగంలో కామికా ఏకాదశి చేస్తే... అంతులేని సంపద మీ సొంతం.. 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News