Sravana masam 2022: శ్రావణమాసం ప్రారంభమైపోయింది. రేపే తొలి సోమవారం. శ్రావణ మాసం తొలి సోమవారానికి విశేష మహత్యముంది. అదే సోమవారం నాడు ప్రదోష వ్రతం కూడా వస్తే ఇక ఆ ప్రాధాన్యత మరింత అధికం. ఆ విశేషాలు మీ కోసం..
హిందూమతం ప్రకారం శ్రావణ మాసానికి అధిక ప్రాధాన్యత, మహత్యమున్నాయి. అదే సమయంలో ఈ నెలలోని అన్ని సోమవారాలు, ప్రదోష వ్రతాలు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు కీలకంగా ఉన్నాయి. ప్రదోష వ్రతం త్రయోదశి తిధి నాడు వస్తుంది. శ్రావణమాసం తొలి ప్రదోష వ్రతం రేపు అంటే జూలై 25, 2022 న ఉంది. ఇది సోమవారం నాడు వచ్చింది. శ్రావణమాసం తొలి సోమవారం కూడా రేపే కావడం విశేషం. ప్రదోష వ్రతం కూడా సోమవారం నాడు రావడంతో తొలి సోమ ప్రదోష వ్రతంగా పిలుస్తారు.
సోమ ప్రదోష వ్రతం లాభాలు
శ్రావణమాసం సోమ ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే శ్రావణ మాసం, సోమవారం, ప్రదోషవ్రతం మూడు కూడా శివుడికి అంకితమైనవే. అందుకే రేపు అంటే జూలై 25న సోమ ప్రదోష వ్రతం ఆచరిస్తూ..పూర్తి భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం వల్ల అనేక రెట్ల పుణ్యం లభిస్తుందని చెబుతారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల కష్టాలన్నీ దూరమై..కోర్కెలు నెరవెరుతాయని విశ్వాసం.
శ్రావణమాసం సోమ ప్రదోష వ్రతం పూజా సమయం, తేదీ
శ్రావణమాసంలోని కృష్ణపక్షం త్రయోదశి తిధి జూలై 25వ తేదీ సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు ప్రారంభమై..జూలై 26 సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు ముగుస్తుంది. ఈ సమయంలో సోమ ప్రదోష వ్రతం పూజలు చేసేందుకు శుభ ముహూర్తం జూలై 25వ తేదీ సాయంత్రం 7 గంటల 17 నిమిషాల్నించి రాత్రి 9 గంటల 21 నిమిషాల మధ్యలో ఉంటుంది. సోమ ప్రదోషవ్రతంలో ధాన్యం, ఉప్పు, బియ్యం తినకూడదంటారు. ఈ వ్రతం పండ్లు తీసుకుని ఉండాలి. ఇది కాకుండా ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి..వ్రత సంకల్పం చేయాలి. ప్రదోషవ్రతంలో సాధారణంగా శివుడి పూజను సాయంత్రం వేళ చేస్తారు. కానీ ఉదయం శివుడి దర్శనం చేసుకోవాలి.
Also read: August Horoscope 2022: ఆగస్టు 1న రాశి మారనున్న బుధుడు.. ఈ 5 రాశుల వారికి వచ్చే నెలలో డబ్బే డబ్బు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook