Grahanam 2023: కొత్త ఏడాదిలో సూర్య, చంద్ర గ్రహణాలు ఎన్ని, ఎప్పుడెప్పుడు, సూతక కాలం

Grahanam 2023: సూర్య, చంద్ర గ్రహణాలు భౌగోళికంగా జరిగే ప్రక్రియలే అయినా..మతపరంగా చాలా ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఈ క్రమంలో కొత్త ఏడాదిలో 2023లో సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడెప్పుడు, ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 25, 2022, 06:55 PM IST
Grahanam 2023: కొత్త ఏడాదిలో సూర్య, చంద్ర గ్రహణాలు ఎన్ని, ఎప్పుడెప్పుడు, సూతక కాలం

మరి కొద్దిరోజుల్లో 2022 సంవత్సరం ముగియనుంది. కొత్త ఏడాది ప్రారంభానికి ముందు 2023లో సూర్య, చంద్ర గ్రహణాలు ఎన్ని ఉన్నాయి, ఎప్పుడు ఏర్పడనున్నాయనే వివరాలు మీ కోసం.

హిందూమతంలో, జ్యోతిష్యశాస్త్రంలో సూర్య, చంద్ర గ్రహణాలకు ప్రాధాన్యత ఉంది. ఈ సమయంలో శుభ కార్యాలకు దూరంగా ఉంటారు. సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో ఏ పనులు చేయాలి, ఏవి చేయకూడదనే విషయంపై చాలా నియమాలున్నాయి. 2023 సంవత్సరంలో సూర్య, చంద్ర గ్రహణాలు మొత్తం ఎన్ని ఏర్పడనున్నాయనేది తెలుసుకుందాం. 2023లో మొత్తం రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి.

2023లో మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ 20, 2023 గురువారం నాడు ఏర్పడనుంది. ఉదయం 7.04 గంటలకు ప్రారంభమై..మద్యాహ్నం 12.29 గంటల వరకూ ఉంటుంది. ఇండియాలో ఈ సూర్య గ్రహణం కన్పించదు. ఇక రెండవ సూర్య గ్రహణం అక్టోబర్ 14 శనివారం ఏర్పడుతుంది. ఇండియాతో పాటు పశ్చిమాఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటికా, అంటార్కిటికా ప్రాంతాల్లో ఈ గ్రహణం కన్పించనుంది. 

ఇక కొత్త ఏడాది 2023లో మొదటి చంద్ర గ్రహణం మే 5, 2023న ఏర్పడనుంది. రాత్రి 8.45 గంటలకు ప్రారంభమై..అర్ధరాత్రి 1 గంటకు ముగుస్తుంది. ఇండియాలో కన్పిస్తుంది. సూతకకాలం 9 గంటలకు ప్రారంభమౌతుంది. రెండవ చంద్ర గ్రహణం అక్టోబర్ 29 ఆదివారం ఏర్పడుతుంది. మద్యాహ్నం 1.06 నిమిషాలకు ప్రారంభమై..మద్యాహ్నం 2.22 గంటల వరకూ ఉంటుంది. ఇది సంపూర్ణ చంద్ర గ్రహణం కావడం గమనార్హం. సూతక కాలం ఉంటుంది.

సూతక కాలం అనేది గ్రహణానికి ముందు ప్రారంభమౌతుంది. సూర్య గ్రహణానికి 12 గంటల ముందు ప్రారంభం కాగా, చంద్ర గ్రహణానికి 9 గంటల ముందు మొదలవుతుంది. సూతక కాలంలో ఏ విధమైన శుభకార్యాలు, పూజలు చేయరు. 

Also read: Surya Gochar 2023: మకర సంక్రాంతి ఈ 4 రాశుల వారి అదృష్టాన్ని తిరగరాయనుంది.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News