Raksha Bandhan 2021 : అన్నా-చెల్లెలు అనుబంధానికి గుర్తు.. రాఖీ పండుగ! ఈ పండుగ విశిష్టత, చరిత్ర ఏంటంటే..!

Raksha Bandhan 2021 : 'అన్నా చెల్లెలి అనుబంధం… జన్మజన్మలా సంబంధం… జాబిలమ్మకిది జన్మదినం… కోటి తారకల కోలాహలం…’ అంటూ సోదర సోదరీమణుల బంధం గురించి గొప్పగా వర్ణించారు సినీ కవులు. మానవీయ సంబంధాలను పటిష్టం చేసేందుకు పరస్పర సోదర భావాన్ని పెంపొందించేందుకు చేసుకునే అపూర్వ వేడుకే..రక్షా బంధన్. ఆ పండుగ విశిష్టత ఏంటో చూద్దాం..!  

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 22, 2021, 01:10 PM IST
  • నేడే రాఖీ పండుగ(ఆగస్టు 22)
  • సోదరులకు రాఖీ కట్టేందుకు సిద్ధమైన సోదరీమణులు
  • సోదరీమణులకు బహుమతులు ఇచ్చేందుకు రెడీ అవుతున్న సోదరులు
Raksha Bandhan 2021 : అన్నా-చెల్లెలు అనుబంధానికి గుర్తు.. రాఖీ పండుగ! ఈ పండుగ విశిష్టత, చరిత్ర  ఏంటంటే..!

Raksha Bandhan 2021 : అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగే...రక్షా బంధన్. సోదర సోదరీమణుల బాంధవ్యం కలకాలం నిలవాలని ఈ పండుగను చేసుకుంటారు. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ ఇది. దీనినే రాఖీ పండుగ, రాఖీ పౌర్ణమి అని..అదే విధంగా వివిధ ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా అంటారు. ఈ ఏడాది ఆగస్టు 22న వచ్చింది ఈ రాఖీ పౌర్ణమి. దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.

హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో ఈ పండుగ(Festival)ను జరుపుకుంటారు. ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతంలోని ప్రజలు మాత్రమే జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చేసుకుంటున్నారు. సోదరి తన సోదరుడు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ(Rakhi) కట్టి ఎప్పుడూ అన్నకు అండగా చెల్లెలు ఉంటుందని చెప్తుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని ఈ పండుగ ద్వారా తెలియజేస్తారు.ఈ రక్షా బంధన్(Raksha Bandhan) గురించి పురాణాలు చెబుతున్నాయి. ఈ పండుగ గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.

Also Read: Varalakshmi Vratham 2021: వరలక్ష్మి వ్రతం...ఇంటిల్లిపాదికి శుభకరం!

ద్రౌపది- శ్రీ కృష్ణుల మధ్య అనురాగాన్ని  తెలిపే కథ
మహాభారత కథలో శ్రీ కృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ సమయంలో  కృష్ణుడు చూపుడువేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపథి తన పట్టు చీర కొంగు చింపి.. అతడి చేతికి కట్టు కట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపథికి హామీ ఇచ్చాడట.  అందుకు ప్రతిగా దుశ్శాసనుడు దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కాపాడారని పురాణాలు చెబుతున్నాయి.

నేటి సమాజానికి  ఎంతైనా అవసరం
నేటి సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న తరుణంలో..రాఖీ పౌర్ణమి(Rakhi Pournami) వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. ఇది మానవ సంబంధాలు మెరుగుదలకు, విచక్షణకు ఈ వేడుక దోహదం చేస్తుంది.  నిద్రావస్థలో ఉన్న మానవీయ విలువలను తిరిగి సాక్షాత్కరింపజేస్తుంది. సభ్య సమాజానికి సంస్కారాన్ని అందిస్తుంది.  రాఖీ పండుగ(Rakhi Festival)ను రక్తం పంచుకుని పుట్టిన సోదర సోదరీమణుల మధ్య జరుపుకోవాలని లేదు ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు, సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు. ఆత్మీయుల మధ్య అనుబంధాలకు, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది.

రాఖీ పండుగ రోజు ఏం చేస్తారంటే..
రాఖీ పండుగ(Rakhi Festival) రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని, రాఖీ కట్టడానికి సిద్ధమవుతారు సోదరీమణులు. సోదరులు కూడా తమ ప్రియమైన సోదరీమణులు కట్టే రాఖీలను స్వీకరించి వారిని సంతోష పపెట్టేలా వారికి బహుమానం ఇవ్వడానికి రెడీ అవుతారు. "యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల" అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు. ఆ తరువాత హారతి ఇచ్చి, నుదుటన బొట్టు పెట్టి స్వీట్ తినిపిస్తారు. చెల్లెలు అన్న ఆశీర్వాదాన్ని, అక్క అయితే  తమ్ముళ్లకు ఆశీస్సులను అందిస్తారు. నిండు నూరేళ్లు సుఖంగా జీవించమని దీవిస్తారు. నీకు నేను ఎప్పుడూ రక్ష అని చెప్తూనే, నాకు నువ్వు రక్షణగా ఉండాలని ధర్మాన్ని రక్షాబంధనంతో బోధిస్తారు. ఇక రక్షా బంధనం(Raksha Bandhan) రోజు సోదరులు(Brothers) ఇచ్చే బహుమతులంటే సోదరీ మణులకు ఎనలేని ప్రేమ . వారికి ఇచ్చే బహుమతి ఏదైనా ఎంతో ప్రేమగా దాచుకుంటారు. తీపి జ్ఞాపకంగా భావిస్తారు.

Also Read: శ్రావణం ప్రారంభం, ఈ నెలలో మంచి ముహూర్తాలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News