Krishna Janmashtami 2022: నేడు శ్రీకృష్ణాష్టమి.. ఈ 4 రాశుల వారికి సిరిసంపదలు వెల్లువెత్తుతాయి!

Auspicious for These 4 zodiac signs pepoles on Shri Krishna Janmashtami 2022. ఈ సంవత్సరం జన్మాష్టమి నాడు 8 శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఆగస్టు 19వ తేదీ అర్ధరాత్రి యోగం చాలా ప్రత్యేకం.  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 19, 2022, 11:32 AM IST
  • నేడు శ్రీకృష్ణాష్టమి
  • ఈ 4 రాశుల వారికి సిరిసంపదలు వెల్లువెత్తుతాయి
  • జన్మాష్టమి 2022 నాడు 8 శుభ యోగాలు
Krishna Janmashtami 2022: నేడు శ్రీకృష్ణాష్టమి.. ఈ 4 రాశుల వారికి సిరిసంపదలు వెల్లువెత్తుతాయి!

Shubh Yog on Shri Krishna Janmashtami 2022: హిందూ సంప్రదాయం ప్రకారం.. కృష్ణుడి అవతారం ఎంతో ప్రత్యేకమైనది. శ్రీ మహా విష్ణువు అవతారాల్లో ఎనమిదవ అవతారమే కృష్ణావతారం. పరంధాముడు బహుళ పక్ష అష్టమి తిథి రోజున రోహిణీ నక్షత్రంలో జన్మించడంతో.. ఆ రోజును కృష్ణాష్టమి అని అంటారు. శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎంతో విశేషమైనవి. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరుశరామ, శ్రీరామ అవతారాల తర్వాత  శ్రీకృష్ణావతారం. శ్రావణమాస బహుళ పక్ష అష్టమి తిథి రోజున రోహిణీ నక్షత్రం అర్ధరాత్రి 12 గంటలకు వృషభ రాశి, వృషభ లగ్నం నందు శ్రీకృడు జన్మించినట్టుగా శాస్త్రం చెబుతోంది.

ఈ సంవత్సరం జన్మాష్టమి నాడు 8 శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఆగస్టు 19వ తేదీ అర్ధరాత్రి యోగం చాలా ప్రత్యేకం. ఈ యోగంలో చేసే శ్రీకృష్ణుని పూజ జీవితంలో ఆనందాన్ని నింపుతుంది. ఇక జన్మాష్టమి రోజు కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశుల వ్యక్తులు శ్రీకృష్ణుని అనుగ్రహంతో చాలా విజయాలు మరియు సంపదలను పొందుతారు. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఓసారి చూద్దాం.

వృషభం
జన్మాష్టమి రోజు రాత్రి చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు. ఇది వృషభ రాశి వారి వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంపై శుభ ప్రభావాన్ని చూపుతుంది. వృషభ రాశి వారు ఉద్యోగ, వ్యాపారాలలో విజయం సాధిస్తారు. అధిక ధనం ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మెరుగవుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. సమాజంలో పేరు, గౌరవం పెరుగుతుంది.

వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి ఈరోజు ధనప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. కొత్త సంబంధం ప్రారంభం కావచ్చు. స్నేహితుల సహకారం ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. జన్మాష్టమి పూజ తర్వాత పంచామృతం తీసుకుంటే.. ఎంతో ప్రయోజనం ఉంటుంది.

కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ జన్మాష్టమి అనేక సుఖ సంతోషాలను ఇస్తుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. కారును కొనుగోలు చేయవచ్చు. ఆస్తి చేతికి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అయితే ఈరోజు విరాళం ఇవ్వడం శ్రేయస్కరం.

సింహం
సింహ రాశి వారికి శ్రీ కృష్ణుడి అనుగ్రహం బాగుంది. అదృష్టం కలిసొస్తుంది. అధిక ధన లాభం ఉంటుంది. ఆదాయం పెరగడంతో అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. గౌరవం పెరుగుతుంది. శత్రువులు మీ ముందు ఓడిపోతారు.

Also Read: కుమార్తె పుట్టిన రోజు.. 1.10 లక్షల పానీపూరీలు పంచిన తండ్రి! ప్రేమంటే ఇదే

Also Read: Shikhar Dhawan: శిఖర్ ధావన్‌ అరుదైన ఘనత.. సచిన్, ధోనీ, కోహ్లీ సరసన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News