Navratri 5th Day, Skandamata Puja Vidhi and Muhurat: నేడు శరన్నవరాత్రులు ఐదవ రోజు.. ఈరోజు అమ్మవారు స్కందమాత రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల జీవితంలో అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి అంతేకాకుండా అనారోగ్య సమస్యలు, ఇంట్లో దుష్ప్రభావాలను దూరమవుతాయని భక్తుల నమ్మకం. అమ్మవారికి స్కందమాతగా పేరు రావడానికి పురాణాల్లో పెద్ద చరిత్ర ఉంది. కాశీఖండంలో స్కంద మాత అమ్మవారి గురించి క్లుప్తంగా వివరించారు. అంతేకాకుండా ఈ అమ్మవారిని ఎంతో శక్తివంతమైన దేవతగా చెప్పుకుంటారు. అయితే ఈరోజు స్కందమాతను ఏయే సమయాల్లో పూజించడం వల్ల జీవితంలో సమస్యలు దూరమవుతాయో, పూజా నియమాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
స్కందమాత రూపం:
పురాణాల ప్రకారం స్కందమాతను సాక్షాత్తు కార్తికేయ తల్లిగా చెప్పుకుంటారు. కార్తికేయుడు ఈ స్కందమాత రూపంలో అమ్మవారి ఒడిలో కూర్చుని దర్శనమిస్తాడు. అమ్మవారి రూపం పద్మాసనం పై కూర్చుని ఉంటుంది. అందమా తన పురాణాల ప్రకారం గౌరీ, మహేశ్వరి, పార్వతి, ఉమా అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ అమ్మవారి వాహనం సింహం కాబట్టి.. భక్తులందరికీ అమ్మవారు సింహ వాహనంలోనే దర్శనమిస్తుంది. సంతానలేమి సమస్యలతో బాధపడే వారికి స్కందమాత వ్రతాన్ని పాటించి ప్రత్యేక పూజలు చేయడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్కందమాతకు ఇష్టమైన రంగు ఇదే:
పురాణాల ప్రకారం స్కందమాత దేవిని శాంతికి సూచికగా భావిస్తారు. ఒత్తిడి మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రోజు తెలుపు రంగు దుస్తులను ధరించి అమ్మవారిని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ పూజలు కూర్చునే వారు తప్పకుండా అందరూ తెలుపు వర్ణం దుస్తులను మాత్రమే ధరించాలి.
స్కందమాత దేవికి ఇష్టమైన నైవేద్యం:
ఈరోజు ప్రత్యేక పూజలు చేసేవారు తప్పకుండా స్కందమాతకు అరటిపండును నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఖీర్ కూడా ప్రసాదంగా సమర్పించవచ్చని పురాణాల్లో పేర్కొన్నారు.
స్కందమాత పూజా విధానం:
దుర్గామాత ఐదవ అవతారమైన స్కందమాతను పూజించేవారు తప్పకుండా ఉదయాన్నే నిద్ర లేవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత గంగాజలంతో స్నానం చేసి శుభ్రమైన తెలుపు వర్ణం దుస్తులను ధరించాలి.
తర్వాత పూజ గదిని శుభ్రం చేసి, పూజను ప్రారంభించాల్సి ఉంటుంది.
అమ్మవారి పూజలో భాగంగా ముందుగా స్కందమాత విగ్రహానికి గంగాజలంతో అభిషేకం చేయాలి.
అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి గంధం, కుంకుమతో అలంకరించి పూజను ప్రారంభించాలి.
అమ్మవారిని తలుచుకుంటూ స్కందమాత ప్రత్యేక మంత్రాలను పాటించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించాలి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..