Sharad Navratri 2023: మరి కొద్దిరోజుల్లో శరద్ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. 30 ఏళ్ల తరువాత శరద్ నవరాత్రుల్లో అత్యంత అరుదైన శుభ సంయోగం ఏర్పడనుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. నవరాత్రి సందర్బంగా ఏర్పడుతున్న ఈ రాజయోగం కొన్ని రాశులకు ఊహించని లాభాల్ని అందించనుంది.
హిందూమతం ప్రకారం ప్రతి యేటా అశ్విని మాసంలోని శుక్లపక్షంలో శరద్ నవరాత్రులు ప్రారంభమౌతాయి. ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి ప్రారంభమై అక్టోబర్ 24 వరకూ ఉంటాయి. మొత్తం 9 రోజులుంటాయి. ఈ ఏడాది నవరాత్రి చాలా ప్రత్యేకం కానుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈసారి విభిన్న రాజయోగాలు ఏర్పడనున్నాయి. శని గ్రహం 30 ఏళ్ల తరువాత తన సొంత రాశి కుంభంలో గోచారం చేయనుండటంతో శశ రాజయోగం ఏర్పడుతోంది. బుద, సూర్య గ్రహాలు కన్యా రాశిలో కలిసి బుధాదిత్య రాజయోగం ఏర్పరుస్తున్నాయి. దాంతోపాటు బుధుడు సొంత రాశిలో గోచారంతో భద్ర రాజయోగం ఏర్పడనుంది. అన్ని రాజయోగాల నిర్మాణం కారణంగా శరద్ నవరాత్రులు 3 రాశులకు అమితమైన లాభాల్ని అందించనున్నాయి. ఈ రాశుల ధన సంపదలు అమాంతం పెరగనున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
తుల రాశి జాతకులకు శరద్ నవరాత్రి సందర్భంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. న్యాయపరమైన అంశాల్లో విజయం లభిస్తుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరగనున్నాయి. కుటుంబ సభ్యులతో చాలా ఎక్కువ సమయం గడపగలుగుతారు. చాలాకాలంగా నిలిచిపోయిన డబ్బులు తిరిగి వస్తాయి. సంతాన సంబంధిత విషయాల్లో మీ కలలు నెరవేరుతాయి. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తదు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మకర రాశిజాతకులకు శరద్ నవరాత్రుల్లో ఏర్పడనున్న వివిద రాజయోగాల కారణంగా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ జాతకులకు అంతులేని ధన సంపదలు కలగనున్నాయి. దుర్గాదేవి కటాక్షం కారణంగా కోరుకున్న కోర్కెలు నెరవేరనున్నాయి. వ్యాపారంలో అధిక లాభాలుంటాయి. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలుంటాయి. ఆర్ధికంగా లబ్ది జరుగుతుంది. పెండింగులో ఉన్న డబ్బులు చేతికి అందుతాయి. పనిచేసే చోటే కాకుండా నలుగురిలో గౌరవం, మర్యాద పెరుగుతాయి.
శరద్ నవరాత్రుల సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత అనుకూలమైన సమయంగా భావిస్తారు. వ్యాపారులకు విశేషమైన లాభాలు కలుగుతాయి. పనిచేసే చోట మీ కష్టానికి గుర్తింపుగా కొత్త బాధ్యతలు లబించవచ్చు. వ్యాపారం విస్తృతమౌతుంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలుంటాయి. జీతభత్యాలు పెరుగుతాయి. ఊహించని ధనలాభం ఉంటుంది. కుటుంబంతో కలిగి ప్రయాణాలు చేయవచ్చు. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది ఏర్పడదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook