Shani Vakri 2023: శని వక్రి కారణంగా 4 నెలల పాటు ఈ రాశులవారి జీవితాలు మారబోతున్నాయి!

Shani Vakri 2023: శని వక్రి కారణంగా చాలా రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాశులవారు ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 10, 2023, 09:40 AM IST
 Shani Vakri 2023: శని వక్రి కారణంగా 4 నెలల పాటు ఈ రాశులవారి జీవితాలు మారబోతున్నాయి!

 

Shani Vakri 2023: జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాల కంటే శని గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. అంతేకాకుండా శని దేవుడిని న్యాయ దేవతగా కూడా పిలుస్తారు. అయితే పోయిన నెలలో శని కుంభ రాశిలోకి తిరోగమన దశలో సంచారం చేసింది. ఈ సంచారం అన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై నాలుగు నెలల పాటు ప్రభావం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ తిరోగమన దశ ముగిసిన తర్వాత అదే రాశిలోకి నవంబర్‌ 04వ తేదిన సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా అన్ని రాశులవారిపై మరింత తీవ్ర ప్రభావం పడే ఛాన్స్‌ ఉండవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారిపై శని ఎఫెక్ట్‌:
వృషభ రాశి:

కుంభరాశిలో శని తిరోగమనం కారణంగా వృషభ రాశి వారికి కొత్త అవకాశాలు పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశివారు ప్రమోషన్స్‌ పొందడమేకాకుండా భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.  నిరుద్యోగులుగా ఉన్నవారికి ఈ క్రమంలో సులభంగా జాబ్‌ లభిస్తుంది. అంతేకాకుండా తీవ్ర ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారికి ఆదాయ వనరులు పెరుగుతాయి. వీరికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈ క్రమంలో అనుకున్న పనులన్ని చేస్తారు.  

Also read: Dark Circles: డార్క్ సర్కిల్స్ మీ అందాన్ని పాడుచేస్తున్నాయా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు

తులారాశి:
కుంభరాశిలో శని తిరోగమనం చేయడం వల్ల ఈ రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో సంతోషం పెరిగే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం కారణంగా తల్లిదండ్రులు పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రాశివారు విలాసవంతమైన జీవనం కూడా గడుపుతారు. అంతేకాకుండా ఊహించని ప్రయోజనాలు పొందవచ్చు. 

మకర రాశి:
శని సంచారం వల్ల మకర రాశివారికి చాలా లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేసేవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో ప్రమోషన్స్‌ కోసం ఎదురు చూస్తున్నవారు ఈ సంచారం కారణంగా మంచి ఫలితాలు పొందుతారు.

Also read: Dark Circles: డార్క్ సర్కిల్స్ మీ అందాన్ని పాడుచేస్తున్నాయా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News