Shani Effect: శని దోషం ఎంతవరకూ ప్రమాదకరం, 2025 వరకూ శనిదోషం వెంటాడనున్న రాశి ఏది

Shani Effect: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనిపీడ లేదా శని దోషానికి చాలా మహత్యముంది. శనిదోషముంటే అన్నీ ఇబ్బందులే. ప్రస్తుతం ఒకరాశివారికి శనిదోషం కారణంగా మూడేళ్లపాటు ఇబ్బందులు తప్పడం లేదు. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 11, 2022, 08:21 PM IST
Shani Effect: శని దోషం ఎంతవరకూ ప్రమాదకరం, 2025 వరకూ శనిదోషం వెంటాడనున్న రాశి ఏది

Shani Effect: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనిపీడ లేదా శని దోషానికి చాలా మహత్యముంది. శనిదోషముంటే అన్నీ ఇబ్బందులే. ప్రస్తుతం ఒకరాశివారికి శనిదోషం కారణంగా మూడేళ్లపాటు ఇబ్బందులు తప్పడం లేదు. ఆ వివరాలు మీ కోసం..

హిందూ పంచాంగాల ప్రకారం శని దోషం, శని పీడ అంటే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. గ్రహాల గోచారం, లేదా వక్రమార్గమనేది కొన్ని రాశులవారికి ప్రయోజనం చేకూరిస్తే..కొన్ని రాశుల వారికి కష్టాల్ని కల్గిస్తుంది. శనిదేవుడిని సాధారణంగా దండించేవాడిగా, న్యాయదేవతగా పిలుస్తారు. అటువంటి శని ఒకవేళ ఏదైనా రాశివారికి లాభం చేకూర్చిందంటే..ఇక వెనక్కి తిరిగి చూసుకోవల్సిన అవసరం లేదు. అదే చెడుగా అయితే నాశనం చేసేవరకూ వదలదు. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర, కుంభ రాశులకు అధిపతి శని. ప్రస్తుతం శని తన రాశి కుంభంలో ఉంది. శని ఏ రాశిలో ఉంటే ఆ రాశివారికి ఇక కష్టకాలం ప్రారంభమైనట్టే. శని ఏదైనా రాశిలో ఉన్నప్పుడు ఆ రాశివారికి తీవ్ర ఇబ్బందులు తప్పవు. శని..కుంభరాశిలో మార్చ్ 29, 2025 వరకూ ఉంటుంది. అంటే మరో మూడేళ్ల వరకూ కుంభరాశివారికి ఇబ్బందులు తప్పవన్న మాట.

కుంభరాశివారికి వాస్తవంగా 2022 జనవరి 24 నుంచే కష్టకాలం ప్రారంభమైంది. శని దశ ఈ రాశి జాతకులపై దుష్ప్రభావం చూపించడం మొదలైంది. ఏప్రిల్ 29, 2022న శని..రాశి మారుతూ..కుంభరాశికి సంబంధించి రెండవ దశకు చేరుకుంది. శని దశ అనేది మూడు దశల్లో ఉంటుంది. రెండవ దశ అన్నింటికంటే భయంకరమైందిగా చెబుతారు. శని ప్రకోపానికి ఎవరైనా తీవ్ర పరిణాలు ఎదుర్కోవల్సిందేనంటున్నారు పండితులు. ఈ దశలో సంబంధిత వ్యక్తులకు నలువైపుల్నించీ కష్టాలెదురవుతాయి. ఏ విధమైన సహాయం కూడా అందకుండా ఆ వ్యక్తి అన్నివిధాలుగా నిర్వీర్యుడైపోతాడు.

ఏదైనా జాతకం కుండలిలో శని బలంగా ఉంటే  ఆ వ్యక్తికి శని కారణంగా ప్రయోజనాలు చేకురుతాయి. శని ప్రభావం ఎప్పుడూ చెడుగానే ఉండాలని లేదు. కొంతమందికి లాభం కూడా చేకూరుస్తుంది. శని చెడుతో పాటు కొంతమందికి లాభదాయకంగా కూడా ఉంటాడు. అదే శని బలహీనంగా ఉంటే మాత్రం ఆ వ్యక్తిని సమస్యలు చుట్టేస్తాయి. తిరిగి తేరుకోనివ్వవు. 

అందుకే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పండితుల్ని సంప్రదించి ఎప్పటికప్పుడు నివారణ మార్గాల్ని అనుసరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కుంభరాశివారు నివారణ మార్గాల్ని అనుసరించడం ద్వారా కొంతవరకూ ఉపశమనం పొందవచ్చు.

Also read: Pitru Dosham Remedies: మీ జాతకంలో పితృ దోషం ఉందా? అయితే అమావాస్య నాడు ఇలా చేయండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News