Shani Nakshatra Transit 2023: అన్ని గ్రహాల్లోకెల్లా నెమ్మదిగా కదిలేది శని. ఇతడు ప్రతి రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. 30 ఏళ్ల శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఉన్నాడు.రీసెంట్ గా శని శతభిష నక్షత్రంలోకి ప్రవేశించాడు. అక్కడే అక్టోబరు 17 వరకు ఉంటాడు. వచ్చే ఆరు నెలలు శతభిషా నక్షత్రంలో ఉండడం వల్ల కొన్ని రాశులవారు బంపర్ ప్రయోజనాలు పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
సింహ రాశి: శనిగ్రహ సంచారం సింహరాశి వారికి చాలా శుభప్రదం కానుంది. మీరు వృత్తి, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. జీతంలో పెరుగదల ఉంటుంది. వ్యాపారులు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీకు పెద్ద ప్యాకేజీతో జాబ్ వచ్చే అవకాశం ఉంది.
తుల రాశి: శనిదేవుడి రాశి మార్పు తులారాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీ జీతం డబల్ అవుతుంది. మరు పాత సమస్యల నుండి బయటపడతారు. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మీరు కెరీర్ లో ముందుకు దూసుకుపోతారు.
మేషరాశి: రాబోయే ఆరు నెలలు మేషరాశి వారికి కలిసి రానుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. జాబ్ చేసేవారు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.
Also Read: Shani Transit 2023: సొంత రాశిలో శక్తివంతంగా మారిన శనిదేవుడు.. ఈ 3 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..
మిథునం: శనిగ్రహం శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడం మిథునరాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. శని గ్రహ రాశి మార్పు మీకు ఎంతో మేలు చేస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మెుత్తానికి ఈ సమయం మీకు మంచిది.
ధనుస్సు: శనిగ్రహం శతభిష నక్షత్రంలోకి ప్రవేశించడం ధనుస్సు రాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీ దాంపత్య జీవితం బాగుంటుంది.
Also Read: Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు పంచగ్రాహి యోగం.. ఈ 5 రాశుల వారికి బంపర్ ప్రయోజనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.