Shani Dev: ఆ రాశిలో శని సంచారం.. ఈ రాశువారు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే అంతే సంగతి..

Shani ki Sade Sati Dhaiya: శని దేవుని చెడు ప్రభావం వల్ల జీవితంలో చాలా రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా జీవితంలో బాధపడే అవకాశాలు కూడా ఉన్నయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2022, 01:06 PM IST
Shani Dev: ఆ రాశిలో శని సంచారం.. ఈ రాశువారు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే అంతే సంగతి..

Shani ki Sade Sati Dhaiya: శని దేవుడు మనిషి చేసే కార్యాలను బట్టి ఫలితాలు ఇస్తాడు. అంతేకాకుండా శని గ్రహం చేసే సంచారాలపై కూడా మనిషుల జీవితాలు ఆధారపడుతాయి. శని దేవుని చెడు ప్రభావం వల్ల జీవితంలో చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చాలా మందిలో ధన నష్టాలు, అనారోగ్య సమస్యలు కూడా రావొచ్చని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే శని గ్రహం వచ్చే సంవత్సరం 2023లో తన రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని వల్ల 12 రాశుల వారిపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో చాలా రకాల దుష్ర్పభావాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.

ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..మకరరాశిలో శని గ్రహం ఉండబోతోంది. కాబట్టి దీని ప్రభావం పలు రాశువారిపై పడే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సంచారం తీవ్ర ప్రభావం 5 రాశులవారిపై అధికంగా పడనుంది. కాబట్టి కుంభం, మకరం, ధనుస్సు రాశులవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా శని గ్రహం సంచారం వల్ల మిథున, తుల రాశువారిపై కూడా ప్రభావం పడే ఛాన్స్‌ ఉందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ రాశువారు డిసెంబర్ నెల మొత్తం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అబద్ధాలు, మోసం అస్సలు చేయడకూడదని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా మూగ జంతువులను హింసించకూడదు.

శనిగ్రహ ఆగ్రహాన్ని నివారించే పరిహారాలు:
>>ఏ పనిలోనేనా తప్పుగా ప్రవర్తించకూడదు, క్రమశిక్షణతో సమాజంలో నడుచుకోవాల్సి ఉంటుంది. సోమరితనం, తప్పుగా ప్రవర్తించే వారిపై శని దేవుడి చెడు ప్రభావం తప్పకుండా ఉంటుంది.  
>>అంతేకాకుండా ఈ క్రమంలో వికలాంగులను అస్సలు అవమానించవద్దు, స్త్రీలను గౌరవించండం కూడా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.
>>ఉరిసి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించి పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.  
>>నల్ల నువ్వులు, తోలు బూట్లు, నల్ల బట్టలు, దుప్పటి మొదలైన శనికి సంబంధించిన వస్తువులను దానం చేయండం కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

 

Also Read : Ginna OTT Streaming: మంచు విష్ణు జిన్నా ఓటీటీ స్ట్రీమింగ్ రేపట్నించే, ఎందులోనంటే

Also Read : Adivi Sesh HIT 2: అన్నీ అనుమానాలే.. అందుకే ఇలా ఉన్నా.. అడివి శేష్ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

 

Trending News