Shani and Guru Vakri 2022 Effect on Zodiac Natives: మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇచ్చేవాడు శనిదేవుడు. అందుకే శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు. ప్రస్తుతం శనిగ్రహం మకరరాశిలో తిరోగమన దిశలో (Shani Retrograde in Capricron) సంచరిస్తుంది. అదే సమయంలో బృహస్పతి గ్రహం తిరోగమన దిశలో కదులుతుంది. ఈ రెండు గ్రహాల రివర్స్ కదలిక మెుత్తం 12 రాశులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండనుంది. ముఖ్యంగా పెళ్లికాని యువతులకు వివాహాలు జరుగుతాయి. అంతేకాకుండా సంతానం లేని దంపతులకు పిల్లలు పుడారు.
మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, తులారాశి, ధనుస్సు, మకరం, కుంభం, మీనం రాశుల వారికి శని-గురువు యొక్క తిరోగమన సంచారం శుభప్రదం. వీరికి సంతానం కలిగే అవకాశం ఉంది. మరోవైపు.. మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, మకరం మరియు కుంభ రాశుల వారికి వివాహాలు నిశ్చయిమవుతాయి. నిశ్చయించవచ్చు.
రాశిచక్ర గుర్తులపై తిరోగమన గురు-శని ప్రభావం
మేషం (Aries) - కెరీర్ లో పురోగతి ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది.
వృషభం (Taurus)- మీకు కొత్త జాబ్ వస్తుంది. వీరికి పెళ్లి కుదురవచ్చు.
మిథునం (Gemini)- స్థల మార్పు ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది.
కర్కాటకం (Cancer) - ఆరోగ్యం క్షీణిస్తుంది. ఉద్రిక్తత నెలకొంటుంది.
సింహ రాశి (Leo)- వివాహం జరిగే అవకాశం ఉంది. వ్యాపారులు లాభపడతారు.
కన్య (Virgo)- మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ కుటుంబానికి సమయం ఇవ్వండి.
తుల రాశి (Libra)- మీరు చదువులో మంచి ఫలితాలు పొందుతారు. మీరు పురోగతిని సాధిస్తారు. సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి.
వృశ్చికం (Scorpio)- స్థల మార్పు ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆస్తిని కొనుగోలు చేయవచ్చు.
ధనుస్సు (Sagittarius)- వృత్తి జీవితంలో గొప్ప విజయం ఉంటుంది. మీరు ఉన్నత పదవి, ప్రతిష్ట పొందుతారు.
మకరం (Capricron)- సంతానం కలుగుతుంది. ఆస్తి లాభం ఉంటుంది.
కుంభం (Aquarius)- ఈ సమయాన్ని ఓపికగా గడపండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఒత్తిడిని దూరం చేయండి.
మీనం (Pisces)- ఈ సమయంలో టెన్షన్ పెరుగుతుంది. ఏదో ఒక చింత కొనసాగుతూనే ఉంటుంది. పాజిటివ్ గా ఉండటానికి ప్రయత్నించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook