Shani Dev: కుంభరాశిలో శనిదేవుడు ఉదయం... ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..

Shani Dev Uday 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, శనిదేవుడు కుంభరాశిలో ఉదయించబోతున్నాడు. దీని కారణంగా మకరం, మిథునం మరియు వృషభ రాశుల వారికి ప్రయోజనం చేకూరుతుంది.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 20, 2022, 01:56 PM IST
Shani Dev: కుంభరాశిలో శనిదేవుడు ఉదయం... ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..

Shani Dev Uday 2023: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చేవాడు శనిదేవుడు. అందుకే ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అంటారు. శనిదేవుడు అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారు బిచ్చగాడైనా సరే బిలియనీర్ అవుతాడు. శని వక్రదృష్టి ఎవరిపై పడుతుందో ఆ వ్యక్తి ధనవంతుడైనా సరే దరిద్రుడిగా మారుతాడు. 2023లో శనిదేవుడు మార్చి 9న ఉదయించబోతున్నాడు. శనిదేవుడి యెుక్క రైజింగ్ మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

శనిదేవుడి ఉదయం ఈ రాశులకు శుభప్రదం
మకరం (Capricorn): శని దేవుడి ఉదయం మీకు లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే శనిదేవుడు మీ జాతకంలో రెండో ఇంట్లో జరగబోతుంది. దీంతో మీరు వ్యాపారంలో ఆకస్మిక ధనలాభాలను పొందుతారు. పాత పెట్టుబడుల నుండి కూడా లాభపడతారు. మరోవైపు మార్కెటింగ్, మీడియా లేదా సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

మిథునం (Gemini): శని దేవుడి ఉదయం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శని దేవుడు మీ రాశి నుండి తొమ్మిదో స్థానంలోకి ప్రవేశించనున్నాడు. దీంతో మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.

వృషభ రాశి (Taurus): శనిదేవుడు ఉదయం కారణంగా మీకు వృత్తి, వ్యాపారం మరియు ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త జాబ్ ఆఫర్ పొందే అవకాశం ఉంది. మీరు కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. మీ బిజినెస్ విస్తరిస్తుంది. మెుత్తానికి ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది. 

Also Read: Malavya Rajyog 2023: అరుదైన యోగాన్ని చేస్తున్న శుక్రుడు.. కొత్త సంవత్సరంలో ఈ 3 రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News