Shani Dev: శనివారం శని దేవుడికి ఎంతో ప్రతికరమైన రోజు. ఈ శనివారం రోజున శని దేవుడికి పూజలు చేయడం వల్ల మనిషి జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. అయితే శని దేవుడికి ప్రత్యేకమన శని వారం రోజున 26 నవంబర్ 2022న ఓ అద్భుతం జరగబోతోందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే తెలుగు పంచాగం ప్రకారం 26 నవంబర్ 2022న చంద్రుడు ధనుస్సు రాశిలో సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా చాలా రాశువారు మంచి ప్రయోజనాలు పొందుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో సూర్యుడు, బుధుడు, శుక్ర గ్రహాలు కూడా కలుస్తాయి. దీంతో శని దేవుడి అనుగ్రహం లభించి మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. అయితే ఈ క్రమంలో పలు పరిహారాలు పాటించాల్సి ఉంటుంది.
శని పరిహారం:
శని చెడు ప్రభావం ఇబ్బుందులు తప్పవు:
శని దేవుడి స్థాన చలనం 7 రోజుల పాటు ఉంటుంది. అయితే దీని కారణంగా పలు రాశువారికి దుష్ప్రభావాలు కలిగే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శని చెడు ప్రభావం వల్ల జాతకంలో మార్పులు సంభవించి శారీరక, మానసిక బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంది.
శనిగ్రహ పరిహారాలు:
శని దేవుడి చెడు ప్రభావం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్న కొన్ని పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ పరిహారాలు క్రమం తప్పకుండా పాటిస్తే జీవితంలోని అన్ని కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుందని శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.
ఈ రాశువారు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది:
శని ప్రభావం పలు రకాల రాశులపై నడుస్తోంది. అయితే ఈ ధనుస్సు, మకరం, కుంభం, మిథునం, తులారాశి వారిపై కూడా పడుతోంది. కాబట్టి తప్పకుండా ఈ రాశువారు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు శని దేవునికి ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
ఈ పరిహారాలు తప్పని సరి:
శని దేవుడి అనుగ్రహం పొందడానికి శనివారాల్లో శని ఆలయంలో ఆవాల నూనెను దానం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా శని దేవుని ఇష్టమైన వస్తువులను దానం చేయాల్సి ఉంటుంది. పేదవారికి ఆహార పదార్థాలు దానం చేయడం వల్ల శని చెడు ప్రభావం నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Watch Now: కాటేసే నాగరాజుకే కిస్ ఇచ్చిన బలరాజు..నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో..
Also Read : Rhino In Football Ground: ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఖడ్గమృగం.. ఆటగాళ్లు ఏం చేశారో చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook