Shani Dev: 2023లో మొదటి సారిగా శని గ్రహ సంచారం.. ఈ రాశులవారికి ఊహించని లాభాలే..లాభాలు..

Shani Dev Chalisa: జోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహానికి చాలా ప్రముఖ్యత ఉంది. అయితే కొత్త సంవత్సరంలో శని గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2022, 01:56 PM IST
Shani Dev: 2023లో మొదటి సారిగా శని గ్రహ సంచారం.. ఈ రాశులవారికి ఊహించని లాభాలే..లాభాలు..

Shani Dev Chalisa: జోతిష్య శాస్త్రంలో శని దేవుడికి, గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా జోతిష్య శాస్త్ర నిపుణులు కర్మ దాత అని కూడా అంటారు. శని దేవుడి చెడు ప్రభావం మనిషిపై పడితే తీవ్ర జీవితంలో చాలా రకాల మార్పలు సంభవించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా శని మంచి ప్రభావం కలిగి ఉంటే అన్ని దేవుళ్ల అనుగ్రహం లభించి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే శని దేవుడికి గ్రహానికి కూడా దగ్గరి సంబంధం ఉంటుంది. కాబట్టి శని గ్రహం సంచారం కారణంగా చాలా రాశులవారిపై ప్రభావం పడుతుంది. అయితే ఈ ప్రభావం కొన్ని రాశువారికి శుభప్రదంగా ఉంటే మరికొన్ని రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగించవచ్చని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జనవరి 17న శని గ్రహ సంచారం వల్ల ఏయే రాశువారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశువారిపై శని గ్రహ ప్రభావం:
జనవరి 16 నుంచి వృషభం, వృశ్చికం, మీనం రాశుల వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రాశులవారికి శని దేవుడి మంచి ప్రభావకం కూడా కలుగుతుంది. ఈ క్రమంలో ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

వృషభ రాశి:
ఈ సంచారం వల్ల కుటుంబ జీవితంలో ఆనందం నెలకొంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో వాహనాలు ఇళ్లు కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌ కూడా ఉంది. ముఖ్యంగా ఈ రాశివారికి విద్యారంగంలో రాణించగలుగుతారు. ఈ రాశివారు ఆర్థికంగా బలపడతారు. ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు. కష్టపడి పనులు చేయడం వల్ల మంచి ఫలితాలు కూడా పొందే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

వృశ్చిక రాశి:
ఈ సంచారం ప్రభావంతో వృశ్చిక రాశి వారు అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు. కాని ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే తీవ్ర నష్టాల పాలయ్యే ఛాన్స్‌ కూడా ఉంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం కూడా లభిస్తుంది. ఆర్థికంగా, సామాజికంగా కూడా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.

మీనరాశి:
మీన రాశివారికి కూడా శని గ్రహ ప్రభావంతో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా శత్రువులపై విజయాలు కూడా సాధిస్తారు. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా కష్టపడి చదవాల్సి ఉంటుంది. వ్యాపారాలు చేసే వారికి ఈ 2 సంవత్సరాల పాటు ఎలాంటి డోకా ఉండదు. ముఖ్యంగా కార్యాలయంలో మంచి పేరు సంపాదిస్తారు.

Also Read: Nayani Pavani Hot Photos: ఎర్ర చీరలో రెచ్చిపోయి అందాలు ఆరబోసిన నయని పావని.. నెవర్ బిఫోర్ హాట్ ట్రీట్!

Also Read: Alia Bhatt Latest Photos: తల్లయ్యాక మళ్లీ హాట్ షో మొదలెట్టిన అలియా భట్.. క్లీవేజ్ అందాల విందు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News