Shani Chandra Yuti 2023: మరో మూడు రోజుల్లో వీరి జీవితం తలక్రిందులు కానుంది.. మీరున్నారా?

Shani Chandra Yuti 2023: మరో మూడు రోజుల్లో శని, చంద్రుల కలయిక వల్ల విష యోగం ఏర్పడబోతుంది.  ఆస్ట్రాలజీలో దీనిని అశుభకరమైన యోగంగా భావిస్తారు. ఈ వినాశకర యోగం మూడు రాశులవారిని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 10, 2023, 12:54 PM IST
Shani Chandra Yuti 2023: మరో మూడు రోజుల్లో వీరి జీవితం తలక్రిందులు కానుంది.. మీరున్నారా?

Vish Yog Effect 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒకే రాశిలో రెండు లేదా అంత కంటే ఎక్కువ గ్రహాల కలయికను యుతి లేదా సంయోగం అంటారు. ఈ మైత్రి కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. మే 13న శని, చంద్రుల కలయిక వల్ల వినాశకరమైన విష యోగం ఏర్పడబోతుంది.  ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా అశుభకరమైనదిగా భావిస్తారు. ఈ కూటమి కొందరికి హానికరంగా ఉంటుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

ఈ రాశులపై విషయోగం దుష్ప్రభావం
కన్య రాశి
ఈ రాశి వారిని వినాశకర యోగం కొంత ఇబ్బంది పెడుతుంది. మీ రాశిచక్రంలోని ఆరవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతుంది. ఈ సమయంలో మీరు మీ శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. పని ప్రదేశంలో నిర్లక్ష్యంగా ఉండకండి, అది మీకే నష్టం. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. కోర్టు కేసుల్లో అపజయం ఎదురవుతుంది.

మీనరాశి
విష యోగం ఈ రాశి వారికి చాలా అననుకూలంగా ఉంటుంది. మీ జాతకంలోని 12వ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతుంది. మీరు సడన్ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మీ వస్తువులు చోరీకి గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో కొత్త పని లేదా వ్యాపారం ప్రారంభించాలనుకునే ఆలోచన మానుకోండి. ఈ టైంలో ఎవరికీ అప్పు ఇవ్వకండి. మీరు హెల్త్ కేర్ తీసుకోండి. 

కర్కాటక రాశి 
కర్కాటక రాశి యెుక్క ఎనిమిదో ఇంట్లో విష యోగం ఏర్పడుతుంది. ఇది ఈ రాశి వారికి అస్సలు కలిసిరాదు. అయితే ఈ సమయంలో కొత్త పనిని ప్రారంభించవచ్చు. సరైన డైట్ తీసుకోండి. ముఖ్యంగా చర్చలకు దూరంగా ఉండండి. ఈ సమయంలో డబ్బు పెట్టుబడి పెట్టాలనే ఆలోచన మానుకోండి. 

Also Read: Budh Margi 2023: బుధుడి ప్రత్యక్ష కదలికతో ఈ రాశులకు ఊహించని అదృష్టం, ఐశ్వర్యం.. మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News