Shani And Jupiter Yog 2023: ప్రతి ఫ్లానెట్ ఒక పర్టికలర్ టైం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తుంది. ఈ గ్రహాలు మూడు దశాబ్దాల తర్వాత హోలీ నాడు అరుదైన యోగం ఏర్పడుతుంది. 30 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఉన్నాడు. అదే విధంగా పుష్కర కాలం తర్వాత దేవగురు బృహస్పతి మీనరాశిలో కూర్చున్నాడు. దీని కారణంగా గురు మరియు శనిదేవుల ప్రత్యేక కలయిక ఏర్పడుతుంది. వీటి సంయోగం వల్ల ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
వృషభ రాశి
గురు మరియు శని దేవుల కలయిక మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. బృహస్పతి మీ జాతకంలో ఆదాయ స్థానంలోనూ, శనిదేవుడు కార్యక్షేత్రంలోనూ సంచరిస్తున్నారు. దీని కారణంగా మీ ఆదాయంలో పెరుగదల ఉంటంది. మీకు అనేక మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. హోలీ తర్వాత ఉద్యోగులకు ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. ఆఫీసులో సహచరుల మద్దతు లభిస్తుంది.
కుంభ రాశి
శని మరియు గురుదేవుల కాంబినేషన్ కుంభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శనిదేవుడు మీ రాశిచక్రం గుండా లగ్న గృహంలో మరియు బృహస్పతి మీ సంచార జాతకంలో 12వ ఇంట్లో ప్రయాణిస్తారు. దీంతో మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. ధనం పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
గురు మరియు శని దేవుల సంయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో శనిదేవుడు మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో మరియు గురుడు ఐదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. అందుకే ఈ సమయంలో మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ సమయం అద్బుతంగా ఉంటుంది. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది.
మిథున రాశి
శని మరియు బృహస్పతి యొక్క ప్రత్యేక కలయిక మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శని దేవుడు మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో మరియు బృహస్పతి పదవ ఇంట్లో కదులుతున్నాడు. దీంతో అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోరికలు నెరవేరుతాయి.
;Also Read: Trigraha Yogam benefits: 30 ఏళ్ల తర్వాత శని రాశిలో త్రిగ్రహ యోగం.. ఈరాశులకు అన్‌స్టాపబుల్ బెనిఫిట్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook