Grah Gochar 2022: కన్యారాశిలో మూడు గ్రహాల సంయోగం.. ఈ 4 రాశుల వారిని వరించనున్న అదృష్టం...

Astrology: ఈ నెలలో మూడు గ్రహాలు ఒకే రాశిలోకి ప్రవేశించనున్నాయి. ఈ గ్రహాల సంయోగం కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 3, 2022, 12:43 PM IST
Grah Gochar 2022: కన్యారాశిలో మూడు గ్రహాల సంయోగం.. ఈ 4 రాశుల వారిని వరించనున్న అదృష్టం...

September Horoscope 2022: అంతరిక్షంలో గ్రహాల మార్పు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతాయి. ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఈ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నాయి. ఇక్కడ మరో విశేషమేమిటంటే మూడు గ్రహాలు ఒకే రాశిలోకి ప్రవేశించడం.

సెప్టెంబరు 10న కన్యారాశిలో బుధుడు తిరోగమనం చేయనుండగా.. సెప్టెంబరు 17న సూర్యుడు అదే రాశిలో సంచరించనున్నాడు, మరోవైపు శుక్రుడు కూడా సెప్టెంబరు 24న కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఒకే రాశిలో మూడు రాశుల సంయోగం అరుదైన విషయం. కన్యా రాశిలో ఈ మూడు గ్రహాలు సంచారం ముఖ్యంగా నాలుగు రాశులవారికి కలిసి రానుంది.  సంచరించడం వల్ల ముఖ్యంగా నాలుగు గ్రహాల వారికి అదృష్టం పెరుగుతుంది. 

మేషం (Aries): కన్యారాశిలో సూర్యసంచారం ఈ రాశివారికి మేలు చేస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. అదృష్టం కలిసిరావడంతో మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

మిథునం (Gemini): బుధుడు తిరోగమనం మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. సమాజంలో గౌరవం  పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. స్టూడెంట్స్ కష్టపడితే తగిన ఫలితాన్ని పొందుతారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. 

కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. చాలాకాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే దాని నుండి ఉపశమనం పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 

కుంభం (Aquarius): శుక్రుని సంచారం వల్ల కుంభ రాశి వారికి లాభం చేకూరుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఆదాయం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.  

Also Read: Dream Science: కలలో ఈ 5 విషయాలు కనిపిస్తే... మీ దశ తిరిగినట్లే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News