Sawan Shivratri 2023: శ్రావణ శివరాత్రి నాడు ఈ రాశులను వరించనున్న అదృష్టం.. మీది ఉందా?

Lord Shiva: శ్రావణ మాసం పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ నెలలో వచ్చే శివరాత్రి చాలా స్పెషల్. ఈ ఏడాది శ్రావణ శివరాత్రి ఎప్పుడు రాబోతుంది, శ్రావణంలో లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 13, 2023, 12:41 PM IST
Sawan Shivratri 2023: శ్రావణ శివరాత్రి నాడు ఈ రాశులను వరించనున్న అదృష్టం.. మీది ఉందా?

Sawan Shivratri 2023: హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. అంతేకాకుండా పరమశివుడికి ఎంతో ఇష్టమైన నెల ఇది. ఈ ఏడాది శ్రావణ మాసం జూలై 4 నుండి ప్రారంభమైంది. ఇది 59 రోజులపాటు ఉండనుంది. ఈ మాసంలో శ్రావణ శివరాత్రి లేదా మహాశివరాత్రి జూలై 15న రాబోతుంది. ఈ పవిత్రమైన రోజున మహాదేవుడిని నిష్టతో పూజించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈసారి శ్రావణ శివరాత్రి నాడు కొందరి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి శ్రావణ శివరాత్రి చాలా లాభాలను ఇస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. 
కన్య రాశి
శ్రావణ శివరాత్రి కన్యారాశి వారికి కెరీర్ లో మంచి పురోగతిని ఇస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగుల స్థానం మరింత బలపడుతుంది. మీకు డబ్బు రాక మెుదలవుతుంది. ఈ సమయంలో కన్యారాశి వారు ఓపికతో పని చేయాల్సి ఉంటుంది.
వృషభం
శ్రావణ శివరాత్రి వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఉండబోతుంది. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. ఈ సమయంలో మీకు గొడవలకు దూరంగా ఉంటే మంచిది. 

Also Read: Shani Vakri 2023: శని తిరోగమనం..నవంబర్ వరకు ఈ రాశులకు చెప్పలేనంత ధనం..

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి శ్రావణ శివరాత్రి స్పెషల్ అనే చెప్పాలి. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ ఆదాయం పెరగడంతోపాటు లాభాలు కూడా వస్తాయి.  మీకు ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
సింహరాశి 
సింహ రాశి వారికి శ్రావణ శివరాత్రి చాలా ప్రత్యేకమైనది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఈ సమయంలో మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

Also Read: Vakri Shani 2023: ఈ 3 రాశుల జీవితాన్ని అల్లకల్లోలం చేయనున్న శని.. మీది ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News