Saturn Vakri: జూన్ 29న శని తిరోగమనం.. ఈ 3 రాశులవారికి ధనమే.. ధనం..

Saturn Vakri Horoscope In Telugu: జూన్ 29న శని కుంభరాశిలో తిరోగమనం చేయడం వల్ల కుంభ రాశితో పాటు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. అలాగే ఈ కింది రాశులవారు విపరీతమైన ధన లాభాలు కూడా పొందుతారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 10, 2024, 11:28 AM IST
Saturn Vakri: జూన్ 29న శని తిరోగమనం.. ఈ 3 రాశులవారికి ధనమే.. ధనం..

 

Saturn Vakri Horoscope In Telugu: జ్యోతిషం ప్రకారం ప్రకారం శని గ్రహాన్ని ఎంతో శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ గ్రహం సంచారం చేస్తే అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. అలాగే ఈ గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి సంచారం చేస్తుంది. అలాగే అప్పుడప్పుడు ఈ గ్రహం తిరోగమనం, నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. దీని కారణంగా కూడా ప్రత్యేక ప్రభావం ఏర్పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే జూన్ 29న శని కుంభరాశిలో తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా 3 రాశులవారికి అనేక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఎప్పటి నుంచో వస్తున్న అడ్డంకులన్నీ కూడా సులభంగా తొలగిపోతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

కుంభ రాశి: 
శని వక్రి కారణంగా కుంభ రాశివారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి పనిల్లో వస్తున్న అడ్డంకులు సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా జీవితంలో పుగోతి కూడా లభిస్తుంది. వీరి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే వ్యాపారంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు సమాజంలో వీరికి మంచి పేరు లభిస్తుంది. దీంతో పాటు ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.  

మేష రాశి: 
ఈ శని తిరోగమనం కారణంగా కూడా మేష రాశి వారి జీవితంలో కూడా పెద్ద మార్పులు వస్తాయి. కెరీర్‌కి సంబంధించిన ప్రమోషన్ కూడా లభిస్తాయి. అంతేకాకుండా డబ్బు సంబంధించిన విషయాల్లో పురోగతి లభించే ఛాన్స్ కూడా ఉంది. వ్యాపారాలు చేసేవారు గొప్ప విజయాన్ని సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు పోటీ పరీక్షలు రాసేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

మిథున రాశి: 
శని అనుగ్రహం కారణంగా మిథున రాశి వారు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఊహించని డబ్బులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు వీరు దిన దిన అభివృద్ధి కూడా చెందుతారు. అలాగే సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News