Shani Dev: అరుదైన యోగాన్ని చేయబోతున్న శనిదేవుడు... ఇక ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే..

Shani Rise 2023: త్వరలో శనిదేవుడు ఉదయించబోతున్నాడు. దీంతో 3 రాశుల వారు వ్యాపారంలో లాభాలతోపాటు కెరీర్ లో ముందుకు వెళతారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2023, 02:12 PM IST
Shani Dev: అరుదైన యోగాన్ని చేయబోతున్న శనిదేవుడు... ఇక ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే..

Shani Uday 2023: గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను మార్చి  శుభ మరియు అశుభ యోగాలను సృష్టిస్తాయి. మార్చి 9న శనిదేవుడు కుంభరాశిలో ఉదయించబోతున్నాడు. దీని వల్ల అరుదైన శష మహాపురుష రాజయోగం ఏర్పడుతుంంది. ఈయోగ ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై కనిపిస్తుంది. ముఖ్యంగా మూడు రాశులవారికి ఇది మంచి ఫలితాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

కుంభం 
శష్ రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో శనిదేవుడు లగ్న గృహంలో ఉదయించబోతున్నాడు. దీంతో మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ కెరీర్ మునుపటి కంటే అద్భుతంగా ఉంటుంది. పాలిటిక్స్ లో ఉన్నవారు పదవిని పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. పెళ్లికాని వారికి వివాహం కుదురుతుంది. 

ధనుస్సు రాశిచక్రం
శనిదేవుడు ధనుస్సు రాశి యెుక్క  మూడవ ఇంట్లో ఉదయిస్తున్నాడు. దీంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ట్రావెలింగ్ చేసేవారు మంచి లాభాలను గడిస్తారు. ఫ్యామిలీ సపోర్టుతో మీరు ఏ పనినైనా అలవోకగా చేస్తారు. మీరు శని సాడే సతి విముక్తి పొందుతారు. 

మేష రాశిచక్రం
మేష రాశి వారికి శష మహాపురుష రాజయోగం ఊహించనంత ధనాన్ని  ఇస్తుంది. ఎందుకంటే మీ రాశి నుండి ఆదాయ స్థానంలో శని దేవుడు ఉదయించాడు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. మీరు షేర్లు, బెట్టింగ్ మరియు లాటరీలలో మంచి లాభాలను గడిస్తారు. 

Also read: Mahashivratri 2023: శివలింగానికి అర్థం, శివుడు లింగ అవతారం ఎత్తడానికి కారణం తెలుసా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

డ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News