Saturn Transit 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఇదే గోచారం లేదా రాశి పరివర్తనం. అదే సమయంలో వివిధ రాశుల్లోకి సక్రమ మార్గం లేదా వక్రమార్గం కూడా పడుతుంటాయి. ఇలా జరగడం వివిధ రాశులపై ప్రతికూల, అనుకూలం ప్రభావం చూపిస్తుంటాయి.
హిందూ జ్యోతిష్యశాస్త్రంలో శని గ్రహాన్ని శక్తివంతమైందిగా భావిస్తారు. ఈ సమయంలో మూల త్రికోణ రాశి కుంభంలో వక్రమార్గంలో ఉంది. త్వరలో శనిగ్రహం సక్రమ మార్గం పట్టనుంది. ఫలితంగా జూన్ 2024 వరకూ కొన్ని రాశులపై కనకవర్షం కురిపించనుంది. అదే సమయంలో శని గ్రహాన్ని న్యాయ దేవతగా పరిగణిస్తారు. శని గ్రహం కుంభ రాశిలో తిరగడం 30 ఏళ్ల తరువాత జరుగుతున్న పరిణామం. జనవరి 2023లో శని కుంభ రాశిలో ప్రవేశించింది. జూన్ నెలలో వక్రమార్గం పట్డాడు. నవంబర్ 4 వరకూ ఇలానే వక్రమార్గంలో ఉండే శని గ్రహం ఆ తరువాత సక్రమమార్గం పట్టనున్నాడు. వచ్చే ఏడాది జూన్ వరకూ అదే స్థితిలో కొనసాగనున్నాడు. ఫలితంగా మొత్తం 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. శని వక్రమ్రార్గంతో ఏయే రాశులపై ఎంలాటి ప్రభావం కన్పిస్తుందో తెలుసుకుందాం.
శనిగ్రహం సక్రమ మార్గం కారణంగా తుల రాశి జాతకులకు అద్భుతంగా ఉండనుంది. ఈ జాతకులకు ప్రతి రంగంలో విజయం తప్పకుండా లభిస్తుంది. వ్యాపారులకు ఊహించని మేర ప్రయోజనాలు కలగనున్నాయి. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా మారుతుంది. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వృషభ రాశి జాతకులకు కుంభ రాశిలో శని సక్రమమార్గంతో అద్భుతమైాన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సమయంలో చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తకుంది. కొత్త ఉద్యోగావకాశాలుంటాయి. ఆర్దిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు వ్యాపారులకు అంతులేని ధనలాభం కలగనుంది. ఉన్నత పదవులు అధిరోహిస్తారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు.
Also read: Saturn Transit 2023: శని గ్రహం తిరోగమనంతో ఈ రాశులవారిపై కనక వర్షం కురవబోతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook