Saturn-Venus Transit: ప్రతి నెల ఏదో ఒక గ్రహం సంచారం చేస్తుంది. ఈ గ్రహ సంచారాల వల్ల అశుభ, శుభ ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఒకే రాశిలో రెండు గ్రహాల సంయోగం చేయడం వల్ల ప్రత్యేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యోగాలు మొత్తం 12 రాశులవారిపై ప్రభావం చూపుతాయి. సుమారు 500 సంవత్సరాల తర్వాత రెండు అద్భుతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. మార్చి నెలలో శుక్రుడు సంచారం చేయడం వల్ల మాళవ్య రాజయోగం ఏర్పడితే..ఆ తర్వాత షష రాజయోగం ఏర్పడబోతోంది. ఈ రెండు రాజయోగాల ప్రభావం అన్ని రాశులవారిపై పడబోతోంది. ముఖ్యంగా ఈ ప్రభావం కొన్ని రాశులవారిపై సానుకూల ప్రభావాన్ని చూపబోతోంది. అయితే ఈ రెండు రాజయోగాల కారణంగా ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మిథున రాశి:
శని-శుక్రుల సంచారం కారణంగా ఏర్పడే ప్రత్యేక యోగాల ప్రభావం మిథునరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారం చేసేవారు వ్యాపార రంగంలో గౌరవంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతారు. ఈ సమయంలో ఎలాంటి పనిలోనైన సులభంగా విజయాలు సాధిస్తారు. దీంతో పాటు ఈ సమయంలో వీరు పెద్దగా కష్టపడకుండానే డబ్బులు పొందుతారు. ఇక ఆస్తుల పరంగా ఉన్న సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవ్వడమే కాకుండా కోర్టు కేసుల్లో సులభంగా విజయాలు కూడా సాధిస్తారు.
తులారాశి:
ఈ రెండు రాజయోగాల ప్రభావం తులారాశివారిపై కూడా పడే అవకాశాలు ఉన్నాయి. శని, శుక్ర గ్రహాల ప్రభావం కారణంగా ఈ రాశివారికి స్థానం, ప్రతిష్టలు పెరుగుతాయి. తుల రాశివారు పిల్లలకు సంబంధించి త్వరలోనే శుభవార్తలు కూడా వింటారు. అంతేకాకుండా ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు సులభంగా కోరికలు నెరవేరుతాయి.
కుంభ రాశి:
శని-శుక్రుని సంచారం కుంభ రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుంభ రాశి వారికి ఈ సమయంలో సులభంగా ఆదాయం పెరగడమే కాకుండా ఎలాంటి పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారం చేసే వారు కొత్త పెట్టుబడిదారులను పొందుతారు. దాంపత్య జీవితంలో మధురమైన రోజులు కూడా ప్రారంభమవుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter