Saturn Transit 2022: కుంభ రాశిలోకి శని సంచారం... ఈ 3 రాశుల వారికి పట్టిన శని పీడ ఇక వదిలినట్లే..

Saturn Transit 2022: అశుభానికి సంకేతంగా భావించే శని గ్రహం ఈ నెల 29న రాశిచక్రం మారనుంది. ఇది కొన్ని రాశులపై సానుకూలంగా, మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2022, 03:58 PM IST
  • ఈ నెల 29న రాశిచక్రం మారనున్న శని
  • కుంభ రాశిలోకి శని సంచారం
  • ఈ 3 రాశుల వారికి కలిసిరానున్న శని సంచారం
Saturn Transit 2022: కుంభ రాశిలోకి శని సంచారం... ఈ 3 రాశుల వారికి పట్టిన శని పీడ ఇక వదిలినట్లే..

Saturn Transit 2022: శని అంటే అశుభానికి, చెడుకు సంకేతం. శని ప్రభావం వెంటాడేవారు ఎంత ప్రయత్నించినా అనుకున్న పనులు పూర్తి చేయలేరు. ఏదీ వారికి కలిసిరాదు. ఒక్కసారి శని గండం నుంచి బయటపడ్డారంటే ఇక వారికి తిరుగుండదు. ఈ నెల 29న శని మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ సంచారం కారణంగా 3 రాశుల వారికి శని పీడ నుంచి విముక్తి లభించనుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం... 

మిథునం : కుంభరాశిలో శని సంచరించిన వెంటనే మిథున రాశి వారికి శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది. శని మకర రాశి నుంచి రాశిచక్రం మారుతుండటంతో ఇన్నాళ్లు వేధించిన సమస్యలన్నీ క్రమంగా తొలగిపోతాయి. అన్ని సమస్యలు తొలగిపోయి సంతోషకరమైన జీవితం గడుపుతారు. 

తుల రాశి: శని కుంభరాశిలోకి ప్రవేశించిన వెంటనే... తుల రాశి వారికి గోల్డెన్ టైమ్ మొదలవుతుంది. జీవితంలో ఎదురైన అడ్డంకులన్నీ క్రమంగా సమాప్తమవుతాయి. ఆర్థిక పురోగతి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. న్యాయపరమైన వివాదాల నుంచి విముక్తి పొందుతారు.

ధనుస్సు: ఏప్రిల్ 29న శనిగ్రహం రాశి మారిన వెంటనే ధనుస్సు రాశి వారికి అన్ని బాధల నుంచి విముక్తి కలుగుతుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థికంగా కలిసొస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో అడ్డంకులు తొలగిపోతాయి.

Also Read: KGF 2 DAY1 COLLECTIONS: చరిత్ర సృష్టించిన రాఖీ భాయ్.. మొదటి రోజే రూ. 135 కోట్లు

Also Read: పెళ్లిలో బిగ్ ట్విస్ట్... ఆపాలంటూ ప్రియురాలి గొడవ... జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన వరుడి బంధువులు... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News