ప్రస్తుతం అంటే ఫిబ్రవరి 27వ తేదీన బుధగోచారం జరిగింది. శని రాశి కుంభంలో బుధుడు ప్రవేశించడంతో ఈ రాశిలో శని, సూర్య, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రహ యోగం ఏర్పడింది. ఫలితంగా మూడు రాశుల జాతకాలపై ఊహించని అనూహ్య లాభాలు కలగనున్నాయి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందడంతో పాటు ఇతర గ్రహాలతో కలిసి యుతి ఏర్పరుస్తాయి. దీనివల్ల విభిన్నమైన శుభ, అశుభ యోగాలు ఏర్పడుతుంటాయి. ప్రస్తుతం శని మూల త్రికోణ రాశి కుంభంలో త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. శని జనవరి 17వ తేదీనే కుంభరాశిలో ప్రవేశించాడు. ఫిబ్రవరి 14వ తేదీన సూర్య గోచారంతో కుంభరాశి ప్రవేశమైంది. తాజాగా ఫిబ్రవరి 27వ తేదీ బుధ గోచారంతో బుధుడు కుంభరాశిలో ప్రవేశించాడు. అంటే కుంభరాశిలో ఇప్పుడు శని, సూర్య, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రహ యోగం ఏర్పడుతోంది. దీని ప్రభావం ఏయే రాశులకు అత్యంత శుభసూచకమో తెలుసుకుందాం..
వృషభ రాశి
కుంభరాశిలో త్రిగ్రహల యోగం కారణంగా ఈ జాతకం వారికి అంతా శుభప్రదంగా ఉండనుంది. ఊహించని ధనలాభం కలుగుతుంది. అదృష్టం పూర్తిగా తోడవుతుంది. కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగులకు చాలా అనువైన సమయం. పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభించనున్నాయి. వ్యాపారం విస్తృతం చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మిధున రాశి
శని, బుధ, సూర్య గ్రహాల యుతి మిథున రాశివారికి అత్యంత లాభదాయకం. ఈ జాతకం వారికి అద్భుతమైన లాభాలుంటాయి. ఉద్యోగ మార్పు యోగముంటుంది. మీరు చేసే ప్రతిపనిలో విజయం లభిస్తుంది. విదేశీ ప్రయాణాలుంటాయి. వ్యాపారం పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీ బ్యాంకు బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుంది.
వృశ్చిక రాశి
శని, సూర్య, బుధ గ్రహాలతో త్రిగ్రహ యోగం వల్ల వృశ్చిక రాశివారికి చాలా అనువైన సమయం. కొత్త వాహనం లేదా కొత్త ఇళ్లు కొనుగోలు చేయవచ్చు. ఈ సమయం వ్యాపారులకు విశేష లాభాలు ఆర్జిస్తుంది. ఈ జాతకం వారికి మంచి లాభాలుంటాయి. ఊహించని ధనలాభం కలుగుతుంది. అదే సమయంలో ఆరోగ్యంపై కూడా అప్రమత్తంగా ఉండాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook