Saturn Retrograde 2023: జూన్ 17 నుంచి రివర్స్ లో కదలనున్న శని.. 139 రోజులపాటు ఈ రాశులవారు జాగ్రత్త..!

Saturn Retrograde 2023: కలియుగ న్యాయమూర్తి శనిదేవుడు త్వరలో కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. శని గ్రహం యెుక్క ఈ రివర్స్ కదలిక కొన్ని రాశులవారికి సమస్యలను కలిగిస్తుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 3, 2023, 03:10 PM IST
Saturn Retrograde 2023: జూన్ 17 నుంచి రివర్స్ లో కదలనున్న శని.. 139 రోజులపాటు ఈ రాశులవారు జాగ్రత్త..!

Shani Vakri Negative Impact on Zodiac Signs: గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. అంతేకాకుండా ఇవి నిర్దిష్ట సమయం తర్వాత తమ కదలికలను మార్చుకుంటాయి. ఆస్ట్రాలజీలో న్యాయమూర్తిగా భావించే శనిదేవుడు మరికొన్ని రోజుల్లో తన సొంత రాశి అయిన కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. జూన్ 17 నుండి నవంబర్ 4 వరకు శనీశ్వరుడు రివర్స్ లో కదులుతాడు. ఈ సమయంలో కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

కర్కాటకం (Cancer) - ఈ రాశి యెుక్క ఎనిమిదో ఇంట్లో శనిదేవుడు తిరోగమనం చేయబోతున్నాడు. దీని కారణంగా మీ హెల్త్ చెడిపోయే అవకాశం ఉంది, కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ద పెట్టండి. మీరు ఈ సమయంలో ఎందులోనూ పెట్టుబడి పెట్టవద్దు. ఈ సమయంలో మీరు అప్పులుపాలయ్యే అవకాశం ఉంది. లవ్ లో ఫెయిల్ అవ్వచ్చు. దాంపత్య జీవితంలో గొడవలు రావచ్చు.
వృశ్చికం (Scorpio) - వృశ్చికరాశి వారి జాతకంలో శనిదేవుడు నాల్గో ఇంట్లో తిరోగమనం చేయబోతున్నాడు. దీంతో మీరు మానసికంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. మీ పనులన్నీ ఆగిపోతాయి. అప్పులు వాళ్లు మిమ్మల్ని వేధిస్తారు. కుటుంబంలో గొడవలు వస్తాయి. మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పుటికీ అనుకున్నంత డబ్బు చేతికి రాదు. మెుత్తానికి ఈ సమయం మీకు అస్సలు కలిసి రాదు.

Also Read: Lucky Zodiac Signs in June: జూన్‌లో ఈ 5 రాశుల వారు చాలా అదృష్టవంతులు.. మీరున్నారా?

మకరం (Capricorn) - ఈ రాశి యెుక్క రెండో ఇంట్లో శనీశ్వరుడు సంచరించనున్నాడు. దీని కారణంగా మీ ఇంట్లో ఒకరి ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మీ మాటలను అదుపులో ఉంచుకోకపోతే మీరు చాలా నష్టపోతారు. మీరు చాలా కష్టాలను ఎదుర్కోంటారు. మీ దాంపత్య జీవితంలో అనుకోని సమస్యలు వస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో భారీగా నష్టాలు వస్తాయి.

Also Read: Surya Gochar 2023: రోహిణి నక్షత్రంలో సూర్య సంచారం.. ఈ 5 రాశుల వారు ధనవంతులవ్వడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News