Saturn Retrograde 2023: శనిగ్రహాన్ని హిందూ పంచాగం ప్రకారం న్యాయ దేవతగా అభివర్ణిస్తారు. శని గ్రహం ఎలా ఉన్నా ఏ దశలో ఉన్నా ఇబ్బందులు కలుగుతాయని అంటారు. అలాంటిది శని గ్రహం వక్రదృష్టి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ముఖ్యంగా ఆ 5 రాశులకు తీవ్రమైన కష్టాలు తప్పవు. అయితే ఈ కష్టాల్నించి విముక్తి పొందేందుకు కొన్ని ఉపాయాలున్నాయి.
హిందూమతం ప్రకారం అత్యంత మహత్యం కలిగిన గ్రహంగా భావించే శని గ్రహం వక్రమార్గం పట్టనుండటంతో 5 రాశులపై వక్రదృష్టి ఉంటుంది. ఫలితంగా ఈ 5 రాశుల జాతకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ 5 రాశుల జాతకులు శని వక్రదృష్టి కారణంగా ఎదుర్కొనే ఇబ్బందుల్నించి ఉపశమనం పొందేందుకు కొన్ని ఉపాయాలు ఆచరిస్తే అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. శనిగ్రహం అంటే న్యాయ దేవత. అంటే చేసిన పనుల్ని బట్టి ప్రతిఫలాన్నిస్తాడు. అంటే వ్యక్తి కర్మల్ని బట్టి శుభ అశుభ పరిణామాలుంటాయి. శనిగ్రహం అత్యంత నెమ్మదిగా కదులుతుండటం వల్ల ఒక్కొక్క రాశిలో దాదాపు రెండున్నరేళ్లు ఉండి అక్కడ శని దోషం ఏర్పరుస్తుంటాడు. అందుకే ప్రతి వ్యక్తిపై శని ప్రభావం ఎక్కువగా కన్పిస్తుంటుంది.
వచ్చే నెల అంటే జూన్ 17వ తేదీన శని గ్రహం కుంభరాశిలో వక్రమార్గం పట్టనున్నాడు. ఫలితంగా ఆ ప్రభావం అందరిపై ఉంటుంది. శని వక్రదృష్టి జాతకం ప్రకారం మంచిది కాదు. ఎవరి జాతకం కుండలిలో శని వక్రావస్థలో ఉంటుందో ఆ జాతకులకు అనుకూలంగా ఉంటుంది. శని గ్రహం 4 నవంబర్ 2023న కుంభ రాశిలో వక్రమార్గం చెంది తిరిగి సరైన మార్గంలో వచ్చేస్తాడు. అంటే 5 నెలలపాటు 5 రాశులకు తీవ్ర ప్రతికూల ప్రభావం ఎదుర్కోవల్సి వస్తుంది. కొన్ని ఉపాయాలు లేదా పద్ధతులు పాటిస్తే ఈ ఆటంకాలు, ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.
వృశ్చిక రాశి జాతకులకు శని వక్రమార్గం కారణంగా అన్ని వైపుల్నించి ఇబ్బందులు చుట్టుముడుతాయి. ఆరోగ్యం పాడవుతుంది. ప్రత్యేకించి ఇంట్లో పెద్ద ఆరోగ్యంపై దుష్ప్రభావం పడవచ్చు. వ్యాపారంలో నష్టాలు ఎదురౌతాయి. ఉద్యోగంలో ఒత్తిడి అధికమౌతుంది. కోర్టు వ్యవహారాలుంటే మీకు వ్యతిరేకంగానే ఉంటుంది. అయితే శని దేవతకు నిత్య పూజలతో ప్రసన్నం చేసుకుంటే అన్నింటి నుంచి విముక్తి లభిస్తుంది.
శని వక్రదృష్టి ప్రభావం మకర రాశిపై స్పష్టంగా ఉంటుంది. మీ మాటలు ఇతరులకు కటువుగా ఉండి సమస్యలకు కారణమౌతుంది. ఫలితంగా ఇతరులతో బంధాలు చెడిపోతాయి. కుటుంబసభ్యుల్లో కూడా ఇదే పరిస్థితి. ప్రేమ వ్యవహారాలకు అనువైన సమయం కాదనే చెప్పాలి. ఎప్పుడో గతంలో పెట్టిన పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగంలో అనుకూల పరిస్థితి ఉండదు.
మేష రాశి జాతకులకు శని గ్రహం వక్రదృష్టితో మిమ్మల్ని పరీక్షించే అవకాశముంది. పని ఒత్తిడి కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. శారీరకంగా, మానసికంగా ఒత్తిడి, ఆందోళన అధికమౌతుంది. వ్యాపారాల్లో తీవ్ర నష్టం కలుగుతుంది. అయితే పరిస్థితుల్ని ఎదుర్కొంటూ సంయమనం పాటించాల్సి ఉంటుంది.
శనిగ్రహం వక్రమార్గం కారణంగా కన్యారాశి జాతకులకు ఆర్ధికంగా చాలా క్లిష్టంగా ఉండవచ్చు. అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు వెంటాడవచ్చు. సోదర సోద
రీమణుల మద్య వివాదాలు రావచ్చు. సంయమనంతో ఉంటే సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమౌతాయి. పూర్వీకుల సంపద లభించవచ్చు. ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది.
వృశ్చిక రాశి జాతకులపై శని వక్రమార్గం ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ఆర్దిక పరిస్థితి కుంటుపడుతుంది. కోర్టు వ్యవహారాలు కూడా మీకు వ్యతిరేకంగా ఉండటంతో సమస్యలు మరింతగా వచ్చి పడతాయి. ఇంట్లో తల్లి ఆరోగ్యం పాడయ్యే అవకాశాలున్నాయి. వైవాహిక జీవితంలో ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. అయితే శని దేవుడి కటాక్షం పొందితే అన్ని సమస్యల్నించి గట్టెక్కవచ్చు.
శనిగ్రహం వక్రమార్గం కారణంగా కర్కాటక రాశి జాతకులకు శని దోషం వెంటాడుతుంది. శని వక్రమార్గంలో ఉండటం వల్ల ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దు. ఏదైనా దుర్ఘటన జరిగే అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగులకు అంతగా కలిసి రాదు. వ్యాపారంలో నష్టాలుంటాయి. ఆర్ధికంగా పరిస్థితి అంత అనుకూలంగా ఉండదు. సమీప భవిష్యత్తులో మాత్రం ఇదే శని గ్రహం మిమ్మల్ని ఉన్నత స్థానానికి చేర్చవచ్చు.
Also read : Shani Gochar 2023: శని గోచారంతో శశ మహాపురుష రాజయోగం, ఆ 4 రాశులకు మహర్ధశ వద్దంటే డబ్బు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook