Shani Mul Trikon: ద్వంద్వ మహాపురుష రాజయోగం.. ఈ 4 రాశులవారి అదృష్టం చేంజ్..!

Shani Mul Trikon: జూలై 13న శని మకరరాశిలోకి ప్రవేశించింది. 30 సంవత్సరాల తరువాత శని ఈ రాశులకు శుభ ఫలితాలను ఇవ్వనున్నాడు. దీంతో ఈ రాశుల వారి అదృష్టం రాత్రికి రాత్రే మారిపోనుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 22, 2022, 11:20 AM IST
Shani Mul Trikon: ద్వంద్వ మహాపురుష రాజయోగం.. ఈ 4 రాశులవారి అదృష్టం చేంజ్..!

Shani Mul Trikon: ఆస్ట్రాలజీలో గ్రహాల మార్పు ప్రజల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపిస్తాయి. ఇటీవల కొన్ని పెద్ద ప్లానెట్స్ తమ రాశిని మార్చుకున్నాయి. ఈ గ్రహాల చేంజ్ కారణంగా శష, మాలవ్య అనే రెండు మహారాజయోగాలు ఏర్పడుతున్నాయి. సూర్యుడు, బుధుడు కలిసి మిథునరాశిలో బుధాదిత్య యోగాన్ని సృష్టించాయి. దీంతో భద్రయోగం కూడా ఏర్పడుతోంది. శుక్రగ్రహం కూడా వృషభరాశిలో మాళవ్య యోగాన్ని ఏర్పరిచింది.  అదేవిధంగా శుక్రుడు జూలై 13 న, మిథునరాశిలో సంచరించడం వల్ల త్రిగ్రాహి యోగంతో పాటు లక్ష్మీ-నారాయణ యోగం ఏర్పడుతోంది. 

శని గ్రహం కూడా 30 సంవత్సరాల తర్వాత తన స్వంత రాశి అయిన మకరరాశిలోకి ప్రవేశించింది. మూలత్రికోణంలో శనిగ్రహం శశ యోగాన్ని ఏర్పరచింది. బృహస్పతి మీనరాశిలో ఉండటం వల్ల హన్స్ యోగం ఏర్పడుతోంది. ఈ కారణంగా ఈ 4 రాశుల గోతర కుండలిలో ద్వంద్వ మహాపురుష రాజయోగం ఏర్పడడం వల్ల విశేష ప్రయోజనం ఉండబోతుంది. రాత్రికిరాత్రే ఈ రాశుల అదృష్టం మారబోతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

సింహం (Leo) - శని ఈరాశిలో ఆరో ఇంట్లో సంచరించబోతున్నాడు. ఈ యోగం ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తుంది. వీరు ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో విభేదాలు రావచ్చు. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధించవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
వృషభం (Taurus)- శని ఈ రాశికి తొమ్మిదవ ఇంట్లో సంచరించబోతున్నాడు. మీ సంచార జాతకంలో 2 రాజయోగాలు ఏర్పడటం వలన, అన్ని పనులలో అద్భుతమైన విజయం ఉంటుంది. వ్యాపారస్తులు లాభపడతారు. ఫ్యామిలీ సపోర్టు ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
కుంభం (Aquarius)- శని ఈ రాశివారి జాతకంలో పన్నెండవ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ కారణంగా ఈ రాశివారు దూర ప్రయాణాలు లేదా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనారోగ్యం బారిన పడే  అవకాశం ఉంది. వాహనాలు నడపేటప్పుడు జాగ్రత్త వహించండి.
వృశ్చికం (Scorpio)- శని ఈ రాశిలో మూడవ ఇంట్లో సంచరించబోతున్నాడు. రెండు రాజయోగాలు ఉద్యోగంలో సానుకూల మార్పులను తెస్తాయి. జీతం పెరుగుతుంది మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారుల్లో లాభం ఉంటుంది. 

Also Read: Angarak Yoga: అంగారక యోగం ఎఫెక్ట్... మరో 9 రోజుల్లో ఈ 5 రాశులవారికి చెడు రోజులు మెుదలు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News