Saturn Effect 2023: శని దేవుడి ప్రభావం.. ఈ రాశుల వారికి అనారోగ్య సమస్యలు! మందులు కూడా పని చేయవు

Shani Sade Sati Angry Gives Health Problems. శని దేవుని అసంతృప్తి వల్ల శరీరంలో ఏదైనా జబ్బు వస్తే.. దాని చికిత్సకు వైద్యుడు ఇచ్చే మందుల వల్ల కూడా ప్రయోజనం ఉండదు.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 20, 2023, 08:52 PM IST
  • శని దేవుడి ప్రభావం
  • ఈ రాశుల వారికి అనారోగ్య సమస్యలు
  • మందులు కూడా పని చేయవు
Saturn Effect 2023: శని దేవుడి ప్రభావం.. ఈ రాశుల వారికి అనారోగ్య సమస్యలు! మందులు కూడా పని చేయవు

Shani Maharaj Angry Gives Health Problems Medicines also do not work: శని దేవుడి అసంతృప్తి బారిన ఎప్పుడూ పడకూడదు. ఒకవేళ శని దేవుడి అసంతృప్తికి గురైతే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శని దుష్ప్రభావం కారణంగా ఆర్ధికంగా, అనారోగ్య పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శని దేవుని అసంతృప్తి వల్ల శరీరంలో ఏదైనా జబ్బు వస్తే.. దాని చికిత్సకు వైద్యుడు ఇచ్చే మందుల వల్ల కూడా ప్రయోజనం ఉండదు. వ్యాధి తీవ్రత కాస్త తగ్గుతుంది కానీ పూర్తిగా నయమవదు. శని దేవుడి ప్రబావం అంతలా ఉంటుంది. 

శనై అంటే నెమ్మది. నెమ్మదిగా కదిలే శని దేవ్ దేవుడు ఓ విధమైన ఆడిటర్ అని చెప్పొచ్చు. ఏడున్నర సంవత్సరాలు శని ఉన్నవారి జాతకంలో.. శని అతని మునుపటి పనులను ఆడిట్ చేస్తాడు. ఆ ఆడిట్ కూడా క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. అంటే మంచి పనులు చేసిన వ్యక్తి యొక్క నివేదిక సానుకూలంగా ఉండగా.. తప్పుడు పనులు చేసిన వ్యక్తి యొక్క నివేదిక ప్రతికూలంగా ఉంటుంది. మనిషి నివేదిక ఆధారంగా శని కొందరికి ఆనందాన్ని, మరికొందరిని శిక్షిస్తాడు. 

శని దేవుడి ఎవరి మీద కోపం తెచ్చుకుంటాడో.. అతడు నిద్రలేని రాత్రులు గడుపుతాడు. తప్పుడు పనులకు పాల్పడేవారు గందరగోళానికి, టెన్షన్‌కు గురవుతారు. పక్షవాతం వ్యాధిలో ఒక వ్యక్తి యొక్క అవయవాలు క్రియారహితం అవుతాయి. అంటే అవయవాలు పనిచేయడం మానేస్తాయి. శని దేవుని ఆగ్రహానికి గురైన వారు ఇలాంటి వ్యాధి బారిన పడాల్సి ఉంటుంది. కష్టపడి పని చేసేవారిని శని దేవుడు ఇష్టపడతాడు. 

స్పాండిలైటిస్ విషయంలో దిండు వాడకూడదని, గట్టిగా నిటారుగా బెడ్ మీద పడుకోవాలని, కాస్త వ్యాయామం చేయాలని డాక్టర్ సూచిస్తే.. ఇది శని దేవుడు ఇచ్చిన సమస్య అని మీరు అర్థం చేసుకోవాలి. డాక్టర్ ఇచ్చే పెయిన్ కిల్లర్ తాత్కాలిక ఉపశమనం ఇవ్వగలదు కానీ శాశ్వతంగా పోదు. వైద్యం చేయించుకోవద్దని ఇక్కడ చెప్పడం కాదు.. వైద్యుని సలహా మేరకు ఫిజియోథెరపీ తీసుకోవాలి. ఇలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే వారు శనిని ప్రసన్నం చేసుకోవాలి.

Also Read: బుసలు కొడుతున్న 20 అడుగుల కింగ్ కోబ్రా.. సింగిల్ హ్యాండ్‌తో పట్టేశాడు! మెంటలెక్కించే వీడియో  

Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మార్చ్‌లోనే DA పెంపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News