Samsaptak Yog: సింహరాశిలో రెండు భయంకరమైన గ్రహాల కలయిక.. ఈ 3 రాశులవారి జీవితం అల్లకల్లోలమే ఇక..

Samsaptak Yog negative effect: జూలైలో అంగారకుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అంతేకాకుండా శనితో కలిసి సంసప్తక యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ యోగం వల్ల మూడు రాశులవారు సమస్యలను ఎదుర్కోనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 28, 2023, 05:51 PM IST
Samsaptak Yog: సింహరాశిలో రెండు భయంకరమైన గ్రహాల కలయిక.. ఈ 3 రాశులవారి జీవితం అల్లకల్లోలమే ఇక..

Shani Mangal Yuti Makes Samsaptak Yog: గ్రహాల కలయిక వల్ల ఏర్పడే శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. మరో రెండు రోజుల తర్వాత అంటే జూలై 1న 01:52కి గ్రహాల కమాండర్ అంగారకుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. కుజుడిని అగ్నిమూలకంగా భావిస్తారు. మార్స్ గ్రహానికి అనుకూలమైన రాశిగా సింహరాశిని పేర్కొంటారు.  ఇదే రాశిలో కుజుడు శనితో కలిసి సంసప్తక యోగాన్ని ఏర్పరచనున్నారు. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు సమస్యలు ఎదుర్కోనున్నారో తెలుసుకుందాం. 

కన్యా రాశి
ఈ రాశి యొక్క పన్నెండవ ఇంట్లో కుజుడు, ఆరో ఇంట్లో శని సంచరించబోతున్నారు. సంసప్తక యోగం కారణంగా మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. దిగుమతి-ఎగుమతి వ్యాపారం చేసేవారు చాలా నష్టపోతారు. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆఫీసులో మీరు చాలా సమస్యలను ఎదుర్కోంటారు. 
మేషరాశి
మేషరాశిలోని ఐదవ ఇంట్లో కుజుడు,  పదకొండవ ఇంట్లో శని కూర్చున్నారు. దీంతో మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. ఈ సమయంలో స్టాక్ మార్కెట్లో అస్సలు పెట్టుబడి పెట్టొద్దు. ఇతరులతో మర్యాదగా ప్రవర్తించండి. విద్యార్థులకు ఈ సమయం అంతగా కలిసి రాకపోవచ్చు. లవ్ లో గొడవలు వచ్చే అవకాశం ఉంది.
మకరరాశి
శని మరియు కుజుడు కలయికతో ఏర్పడిన సంసప్తక యోగం మకర రాశి వారికి చాలా అశుభకరం. దీంతో మీ కుటుంబంలో కలహాలు రావచ్చు. మీ ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పూజల వల్ల  మేలు జరుగుతుంది. మీ మాటలను అదుపులో ఉంచుకోండి.

Also Read: July Hororscope 2023: జూలైలో ఈ గ్రహాల సంచారం ఈ రాశులవారిని కోటీశ్వరులను చేస్తుంది.. మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x