Rajyog 2024: ఈ రోజు నుండి ఈ 3 రాశులకు దశ తిరగబోతుంది.. ఇందులో మీ రాశి ఉందా?

Shukra Gochar 2024: ఈ నెల 20న ఒకే రాశిలో బుధుడు, శుక్రుడు కలయిక వల్ల శుభకరమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడింది. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం  పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2024, 05:03 PM IST
Rajyog 2024: ఈ రోజు నుండి ఈ 3 రాశులకు దశ తిరగబోతుంది.. ఇందులో మీ రాశి ఉందా?

Laxmi Narayan Yog effect on Zodiac Signs: గ్రహాల రాశులను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో సంయోగం జరిపి అరుదైన యోగాలను ఏర్పరుస్తాయి. జనవరి 20వ తేదీన ధనస్సు రాశిలో బుధుడు, శుక్రుడు కలయిక వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడింది. పైగా నిన్న పుష్యమాసం శుక్లపక్షం పదో రోజు. ఈ రోజున లక్ష్మీ నారాయణ యోగం, శుక్ల యోగం, కృత్తిక నక్షత్రాల శుభ కలయిక జరగడం వల్ల ఈరోజుకి ప్రాధాన్యత పెరిగింది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, లక్ష్మీనారాయణ యోగం 5 రాశులవారికి శుభప్రంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 

కర్కాటక రాశి
లక్ష్మీనారాయణ రాజయోగం వల్ల కర్కాటక రాశి వారు శుభవార్త వింటారు. మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. అనుకున్న సమయానికి మీ పనులు పూర్తవుతాయి. మీరు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. మీరు ఈ టైంలో పెట్టే పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లభిస్తుంది. మీ లైఫ్ లో ఉన్న కష్టాలు తొలగిపోవాలంటే రావిచెట్టుకు నీళ్లు పోయడంతోపాటు దాని కింద దీపం వెలిగించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 
వృషభ రాశి
బుధుడు, శుక్రుడు ఏర్పరిచిన లక్ష్మీనారాయణ రాజయోగం వల్ల వృషభరాశి వారు ఆర్థికంగా లాభపడతారు. మీ కెరీర్ లోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆఫీసులో మీరు గౌరవాన్ని పొందుతారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. ఆవాలనూనెతో శనిదేవునికి దీపం వెలిగించడంతోపాటు 'ఓం ఐం హ్లీం శ్రీశనేశ్చరాయ నమః' అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 
తులారాశి
బుధుడు మరియు శుక్రుడు చేస్తున్న రాజయోగం తులారాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ రోగనిరోధక శక్తి పెరుగడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ప్రతి శనివారం పేదలకు ఆహారం తినిపించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 

Also Read: Luckiest Zodiac Signs: ఈరోజు అరుదైన శుభ యాదృచ్చికం.. ఈ 3 రాశుల వారిపై డబ్బు వర్షం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News