Ramadan festival 2022: రంజాన్ నెల ప్రాముఖ్యత, ఉపవాస దీక్షలు, ప్రతి యేటా రంజాన్ తేదీ పదిరోజులు ముందుకొచ్చేందుకు కారణాలేంటి

Ramadan Importance: ముస్లింలకు పవిత్రమైన రంజాన్ నెల ప్రారంభమై అప్పుడే వారం రోజులు కావస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముస్లిం అత్యంత నిష్టతో ఉపవాసాలు ఆచరిస్తాడు. అసలు రంజాన్ నెలలోనే ఉపవాసాలు ఎందుకుంటారు..ఆ వివరాలు  ఇవీ..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 2, 2022, 10:02 AM IST
  • రంజాన్ నెలలోనే ముస్లింలు ఉపవాసాలు ఎందుకుంటారు
  • పవిత్ర ఖురాన్ అవతరించిన నెల కావడంతో అంతటి ప్రాధాన్యత
  • రంజాన్ నెల..ఇంగ్లీషు క్యాలెండర్‌లో ఏడాదంతా ఎందుకు తిరుగుతుంది
Ramadan festival 2022: రంజాన్ నెల ప్రాముఖ్యత, ఉపవాస దీక్షలు, ప్రతి యేటా రంజాన్ తేదీ పదిరోజులు ముందుకొచ్చేందుకు కారణాలేంటి

Ramadan Importance: ముస్లింలకు పవిత్రమైన రంజాన్ నెల ప్రారంభమై అప్పుడే వారం రోజులు కావస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముస్లిం అత్యంత నిష్టతో ఉపవాసాలు ఆచరిస్తాడు. అసలు రంజాన్ నెలలోనే ఉపవాసాలు ఎందుకుంటారు..ఆ వివరాలు  ఇవీ..

ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెల రంజాన్. ఇస్లామిక్ క్యాలెండర్ మొహర్రం నెలతో ప్రారంభమవుతుంది. అలా రంజాన్ ఓ నెల పేరు. రంజాన్ తరువాత షవ్వాల్, ఆ తరువాత జిల్ ఖదా నెలలుంటాయి. ఇస్లామిక్ క్యాలెండర్‌లో చివరి నెల జిల్ హిజ్జా. ఈ నెలలోనే బక్రీద్ పండుగ జరుపుకుంటారు. ఇక రంజాన్ నెలలో ఏ నెలకూ లేనంత ప్రాధాన్యత ఉంది ఇస్లాంలో. 

రంజాన్ నెల ప్రాముఖ్యత

రంజాన్ నెలలో మానవాళికి సందేశాన్నిచ్చే పవిత్ర ఖురాన్ దైవగ్రంధంగా అవతరించింది. ప్రపంచంలోని ముస్లింలందరికీ ఇదే మార్గదర్శిని. ఖురాన్ అవతరించిన నెల కాబట్టే రంజాన్ నెలకు అంత ప్రాముఖ్యత. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల కాబట్టి..రంజాన్ నెలంతా అంటే విధిగా ఉపవాసాలుండాలనేది ఇస్లాం మత నిబంధన. ఇది సంప్రదాయం కాదు ముస్లింలపై ఉన్న విధి. విధి అంటే కచ్చితంగా ఆచరించాల్సిందే. రంజాన్ నెలంతా కఠోర ఉపవాస దీక్షలతో శరీరాన్ని, కోరికల్ని అదుపులో ఉంచుకోవడం అలవాటు చేసుకుంటారు. ఈ అలవాటే మిగిలిన 11 నెలలుండాలనేది అంతర్లీన ఉద్దేశ్యం. పవిత్ర ఖురాన్ గ్రంధం క్రీస్తుశకం 610 ప్రాంతంలో అవతరించిందని తెలుస్తోంది. ఖురాన్ గ్రంధమనేది ఒకేసారి అవతరించలేదు. ఆయత్ అంటే వాక్యాల రూపంలో 23 ఏళ్ల పాటు అవతరిస్తూనే ఉంది. 

రంజాన్ నెల ఏడాది అంతా ఎందుకు తిరుగుతుంది

రంజాన్ నెల ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెల. రంజాన్ నెలలోనే ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించింది. అందుకే ఈనెలలో ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఆచరిస్తారు. ఇక ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రంజాన్ నెల ప్రతియేటా పది రోజులు ముందుకు జరుగుతుంటుంది. అంటే ఏడాదంతా రంజాన్ పండుగ సంభవిస్తుంటుంది. ఇస్లామిక్ క్యాలెండర్ మూనార్ క్యాలెండర్ కాబట్టి ఇలా జరుగుతుంటుంది. పూర్తి వివరాల కోసం...

ఇస్లామిక్ క్యాలెండర్ అనేది చంద్రమానం ప్రకారం వస్తుంది. అంటే ఇంగ్లీషు క్యాలెండర్‌లో 30,31 రోజులున్నట్టుగానే, ఇస్లామిక్ నెలల్లో 29 లేదా 30 రోజులుంటాయి. అంటే ఇంగ్లీషు క్యాలెండర్‌తో పోల్చుకున్నప్పుడు ప్రతియేటా పది రోజులు మినహాయించుకోవల్సి వస్తుంది. అందుకే రంజాన్ నెల ప్రతి యేటా పది రోజులు ముందుకొస్తుంటుంది. ఉదాహరణకు ఈ ఏడాది రంజాన్ నెల ఏప్రిల్ 3 న ప్రారంభమైంది. వచ్చే ఏడాది అంటే 2023లో మార్చ్ 24 తేదీన ప్రారంభం కావచ్చు. ఆ పై ఏడాది అంటే 2024లో మార్చ్ 16న ప్రారంభమవుతుంది. అలా రంజాన్, బక్రీద్ పండుగలు ఇంగ్లీష్ క్యాలెండర్ ఏడాది అంతా తిరుగుతాయి. ఒక్కోసారి వేసవిలో, వర్షాకాలంలో, చలికాలంలో వస్తుంటుంది. 

Also read: Sriramanavami: భద్రాచలంలో సీతారాముల కళ్యాణ విశేషాలు తెలుసుకుందామా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News