Raksha Bandhan Wishes 2023: మీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు మీకు దూరంగా ఉన్నారా? ఈ కోట్స్ వారి కోసమే..

Raksha Bandhan Wishes 2023 Telugu: రాఖీ పండగ పండగ సందర్భంగా మీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు మీకు దూరంగా ఉంటే వారి కోసం ఇలా శుభాకాంక్షలు తెలపండి. అంతేకాకుండా మీలో ఉన్న ప్రేమను వారికి తెలియజేయండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 30, 2023, 03:54 PM IST
Raksha Bandhan Wishes 2023: మీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు మీకు దూరంగా ఉన్నారా? ఈ కోట్స్ వారి కోసమే..

 

Raksha Bandhan Wishes 2023 Telugu: రాఖీ పండగ వేడుకలు దేశవ్యాప్తంగా కులమతాలు లేకుండా జరుపుకునే పండగా..తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగను జంద్యాల పూర్ణిమనిగా కూడా పిలుస్తారు. అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమను మరింత బలపరుచుకోవడానికి సోదరుల కుడి చేతికి రాఖీని కట్టి పండగను జరుపుకుంటారు. రాఖీని కొన్ని రాష్ట్రాల్లో రక్షాబంధన్ అని కూడా అంటారు. అయితే ఈ రోజు అన్నతముళ్లకు రాఖీని కట్టి అక్షింతలను తలపై వేసి ఉన్నత శిఖరాలకు చేరాలని దీవిస్తారు. అయితే మీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు మీకు దూరంగా ఉంటే వారి కోసం సోషల్‌ మీడియా ద్వారా కోట్స్‌, శుభాకాంక్షలు పంపండి.. 

✾అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు✾

అన్ని సమయాలలో నాతో కొట్లాడుతూ.. అంతకు మించి ప్రేమను పంచే సోదరికీ.. 
✾ రక్షాబంధన్ శుభాకాంక్షలు ✾

ఈ ప్రపంచంలో అందమైన అనుబంధం.. అంతులేని అనురాగం అన్నా, చెల్లెళ్ళ బంధం..
✾ రక్షాబంధన్ శుభాకాంక్షలు ✾

అమ్మలో సగమై.. నాన్నలో సగమై.. అన్న వై.. అన్నీ నీవై... నను నీ కంటిపాపలా చూసుకునే అన్నయ్యా.... నీ చల్లని దీవెనలే నా భవితకు పూలవానలు. నీ ప్రియమైన చెల్లెలు..
✾ రక్షాబంధన్ శుభాకాంక్షలు ✾

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

నువ్వు లేకపోతే నాకు చిన్నతనమే లేదురా..లవ్యూరా అన్నాయ్యా..

✾ రక్షాబంధన్ శుభాకాంక్షలు ✾

అమ్మలోని మెదటి అక్షరాన్ని,
నాన్న లోని చివరి అక్షరాన్ని,
కలిపి సృష్టించిన అపూర్వ పదమే అన్న..
✾ రక్షాబంధన్ శుభాకాంక్షలు ✾

అమ్మ ప్రేమ కమ్మనిది,
 నాన్న ప్రేమ చల్లనిది ,
ఆ రెండూ కలసిన అన్నాచెల్లెలి ప్రేమ అపురూపమైనది..
✾ రక్షాబంధన్ శుభాకాంక్షలు ✾

నీ చేతుల్లో పెరిగాను నీ వెనుకే తిరిగాను.. నువ్వు గారం చేస్తుంటే పసిపాపనవుతా..ప్రియమైన నీ చెల్లెలు.
✾ రక్షాబంధన్ శుభాకాంక్షలు ✾

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News