Raksha Bandhan Wishes 2023: భారతీయులు ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ఎంతో ఘనంగా రాఖీ పండగను జరుపుకుంటారు. పవిత్రమైన రాఖీ పండగ రోజున సోదరీమణులు తమ సోదరుడికి రక్షా సూత్రాన్ని కుడి చేతికి కట్టి దీర్ఘాయువు పొందాలని దీవిస్తారు. అంతేకాకుండా కొన్ని ఈ రోజు వ్రతాలు కూడా పాటిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో మీ సోదరీమణులు మీకు అందుబాటులో ఉండదు. దీని కారణంగా రాఖీ కట్టడం మిస్ అవుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో వారి కోసం ఈ శుభాకాంక్షలు తెలియజేసి సంతోష పరచండి.
మీ సోదరులకు, సోదరీమణులకు ఇలా శుభాకాంక్షలు తెలపండి:
రాఖీ అనేది బంధంతో వేసే బలమైన ముడి..
రాఖీ అంటే చిన్న నాటి ప్రేమ, తీపి అల్లర్ల సూచిక..
ఇలాంటి రాఖీ పండగ రోజున మీ సోదరుడి దీర్ఘాయువు కోసం ప్రార్థించండి.
✽రక్షాబంధన్ శుభాకాంక్షలు✽
ఎన్ని అడ్డంకులు వచ్చిన ప్రతి సంవత్సరం నీకు రాఖీ కడుతూనే ఉంటాను..
✽రక్షాబంధన్ శుభాకాంక్షలు✽
జీవితంలో మరెన్నో రాఖీ పండగలను జరుపుకోవాలని కోరుకుంటూ..
✽రక్షాబంధన్ శుభాకాంక్షలు✽
రాఖీ విలువ ఎలా తెలుస్తుందో?
అక్కలు లేని వారిని అడగండి..
ఒకరి గాయానికి ప్రేమతో కట్టు కట్టేదెవరు..
అక్కాచెల్లెళ్లు లేకపోతే రాఖీ కట్టేదెవరు..!
✽రక్షాబంధన్ శుభాకాంక్షలు✽
ఇది పట్టు కంకణమే కాదు..
అన్నదమ్ములు, చెల్లిలు మధ్య ఉన్న పవిత్ర బంధం,
ఇది దారం కాదు వాగ్దానం,
సోదరికి సోదరుడిపై ఉన్న నమ్మకం..
✽రక్షాబంధన్ శుభాకాంక్షలు✽
ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి