Rahu Rashi Parivartan 2023: గ్రహాల్లో అత్యంత ముఖ్యమైన గ్రహం కేతువు తిరోగమనం చేయబోతున్నాడు దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ఈ తిరోగమనం ప్రభావం పడి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అత్యంత ఆశుభగ్రహంగా పరిగణించే కేతు గ్రహం అక్టోబర్ నెలలో తులారాశి నుంచి కన్యారాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు జరిగే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కేతువు సంచారం కారణంగా ఏయే రాశుల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కన్యా రాశి:
కేతు గ్రహం సంచారం కారణంగా రాశి వారికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కేతు సంచారం కారణంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మానసి ఒత్తిడి కూడా తగ్గే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ప్రేమ జీవితంలో కూడా హెచ్చు తగ్గులుంటాయి. వీరు డబ్బు సంపాదించడానికి ఎలాంటి పనులు చేసిన సులభంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.
Also Read: Minister Senthil Balaji: తమిళనాడు గవర్నర్ సంచలన నిర్ణయం.. మంత్రివర్గం నుంచి సెంథిల్ బాలాజీ తొలగింపు
సింహ రాశి:
ఈ రాశివారికి కేతువు సంచారం కారణంగా చాలా మేలు జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. కోరికలు కూడా సులభంగా నెరవేరడమే కాకుండా వ్యక్తుల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. సామాజిక ప్రతిష్ట కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో సింహరాశివారికి ఆర్థిక ప్రయోజనాలు పెరిగి, ఖర్చులు కూడా తగ్గుతాయి.
ధనుస్సు రాశి:
కేతువు సంచారం కన్యారాశిలో జరగబోతోంది. దీని కారణంగా ధనుస్సు రాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారం, ఉద్యోగాలు చేసేవారికి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి కొత్త అవకాశాలు వచ్చే ఛాన్స్ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రమోషన్స్‌తో పాటు జీతాలు కూడా పెరిగవచ్చు. అయితే వీరు ఆర్థిక విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మీ తండ్రి మద్ధతు లభించి అన్ని పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు.
Also Read: Minister Senthil Balaji: తమిళనాడు గవర్నర్ సంచలన నిర్ణయం.. మంత్రివర్గం నుంచి సెంథిల్ బాలాజీ తొలగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి