Rahu Ketu rashi Parivartan in 2023: ఏడాదిన్నరకు ఒకసారి రాహు మరియు కేతు గ్రహాలు తమ రాశులను మారుస్తాయి. తొమ్మిది గ్రహాల్లో రాహు-కేతు మాత్రమే ఎల్లప్పుడూ తిరోగమన దిశలో తిరుగుతూ ఉంటాయి. గ్రహ సంచారం పరంగా 2023 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఈ సంవత్సరం ప్రారంభంలో జనవరి 17న కుంభరాశిలో సంచరించనుంది. రాహు-కేతు గ్రహాలు (Rahu Ketu Gochar 2023) అక్టోబరు 30న తమ రాశులను ఛేంజ్ చేయనున్నాయి. రాహువు మీనరాశిని వదిలి మేషరాశిలోకి, కేతువు తులరాశిని విడిచిపెట్టి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. రాహు-కేతువుల రాశి మారడం వల్ల కొన్ని రాశులవారికి ఇబ్బందులు రానున్నాయి.
రాహు-కేతు గోచారం ఈ రాశులకు ఇబ్బందులు
మేషం (Aries): మేషరాశి వారు అక్టోబర్ 30 తర్వాత జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తులకు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఇతరులతో వివాదాలు పెరగవచ్చు. ఆఫీసులో అనేక రకాల సమస్యలను ఎదుర్కోంటారు. ఈ సమయంలో ఓపిగ్గా ఉండటం మంచిది.
వృషభం (Taurus): రాహు-కేతు సంచారాన్ని వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉండదు. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఈసమయంలో మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనేక సమస్యలను కొని తెచ్చుకుంటారు. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం బాగుండదు.
మకరం (Capricorn): మకర రాశి వారికి జీవితంలోని అనేక రంగాలలో సమస్యలను కలిగిస్తుంది. వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. పని పట్ల ఆసక్తి ఉండదు. వ్యాపారం జిడ్డుగా నడుస్తోంది. శ్రమకు తగిన ఫలితం లభించదు. కుటుంబంలో విభేదాలు తలెత్తుతాయి.
Also Read: Malavya Rajyog: మీన రాశిలో అరుదైన యోగం.. ఈ రాశులవారికి లాభాలే లాభాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.