Pitru Paksha 2022: పితృ పక్షంలో ఇవి తినడం నిషిద్దం, లేకుంటే భారీగా నష్టపోతారు!

Pitru Paksha 2022: పితృ పక్షం యొక్క 15 రోజులు చాలా ప్రత్యేకమైనవి. ఈ సమయంలో చేసే పొరపాట్లు మీకు భారీ నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ పదిహేను రోజులు ఏ పదార్థాలు తినకూడదో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 28, 2022, 04:40 PM IST
Pitru Paksha 2022: పితృ పక్షంలో ఇవి తినడం నిషిద్దం, లేకుంటే భారీగా నష్టపోతారు!

Pitru Paksha 2022: హిందూమతంలో పితృ పక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పితృపక్షంలో చనిపోయిన పూర్వీకులను స్మరించుకుని నివాళులర్పిస్తారు. అంతేకాకుండా ఈ 15 రోజులు పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని ప్రత్యేక పూజలు, దానాలు, శ్రాద్ధం, తర్పణం, పిండప్రదానం చేస్తారు.  ఈసారి పితృ పక్షం (Pitru Paksha 2022) సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 25 వరకు జరుపుకోనున్నారు. ఈ పితృపక్షంలో కొన్ని పనులు చేయడం నిషిద్ధం. పితృ పక్షం సమయంలో మరిచిపోయి కూడా కొన్ని వస్తువులను తినకూడదు. వీటిని తినడం వల్ల మీ జీవితంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. పితృపక్షంలో ఏయే పదార్దాలు తినకూడదో తెలుసుకుందాం.

పితృపక్షంలో వీటిని తినవద్దు...
>> పితృ పక్షం సమయంలో ఆవు పాలు తాగకూడదు.
>> ఆవాల నూనె, ముల్లంగి, బెండకాయలు కూడా శ్రాద్ధ పక్షంలో తీసుకోకూడదు. అలాగే ఈ వస్తువులను ఎవరికీ తినడానికి ఇవ్వకూడదు.
>> పితృ పక్షంలో మసూర్ పప్పు అస్సలు తినకూడదు.
>> పితృ పక్షం సమయంలో తాజా పుడ్ మాత్రమే తీసుకోవాలి, పాత పుడ్ తీసుకోకూడదు. 
 >> శొంఠి మరియు శనగతో చేసిన వస్తువులను తినవద్దు.
>> ఈ 15 రోజుల్లో తెల్ల రాతి ఉప్పును మాత్రమే ఉపయోగించండి.

(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం కొన్ని విశ్వాసాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ తెలుగు న్యూస్ దీన్ని ధ్రువీకరించలేదు.)

Also Read: Palmistry: మీ జీవితం ఎలా ఉంటుందో..చేతివేళ్ల ఆకారం నిర్ణయిస్తుంది, మీ వేళ్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News