Navratri 2023 4Th Day: నవరాత్రుల్లో 4వ రోజు కూష్మాండ అమ్మవారి అనుగ్రహం కోసం ఈ రంగు దుస్తువులను ధరిస్తే చాలు..

Kushmanda 4Th Day Of Navratri: శారదీయ నవరాత్రుల్లో నాలుగవ రోజు కూష్మాండ అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ రోజు నలుపు రంగు దుస్తువులను ధరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2023, 09:08 AM IST
Navratri 2023 4Th Day: నవరాత్రుల్లో 4వ రోజు కూష్మాండ అమ్మవారి అనుగ్రహం కోసం ఈ రంగు దుస్తువులను ధరిస్తే చాలు..

Kushmanda 4Th Day Of Navratri: శారదీయ నవరాత్రుల్లో ఈ రోజు నాలుగవ రోజు..చతుర్థి రోజున అమ్మవారు కూష్మాండ అవతారంలో దర్శనమిస్తుంది. ఈ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల జీవితంలోని సమస్యలన్నీ దూరమవుతాయి. అంతేకాకుండా శత్రువుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని భక్తుల నమ్మకం. కూష్మాండ రూపాన్ని దర్శించి ఉపవాసాలు పాటించేవారికి రోగాలు, దుఃఖం తొలగిపోయి..కీర్తి, బలం, సంపదలు పెరుగుతాయి. అయితే ఈ అమ్మవారిని పూజించేవారు తప్పకుండా పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. 

ఈ రాశులవారిపై అమ్మవారి అనుగ్రహం:
శారదీయ నవరాత్రులు మొత్తం 12 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కానీ వృషభంతో పాటు తుల రాశి వారికి ఈ తొమ్మిది రోజు ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రెండు రాశులవారు 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తి శ్రద్ధలతో ఉండడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. 

కూష్మాండ అమ్మవారికి ఇష్టమైన రంగు:
కూష్మాండ అమ్మవారికి ఆకుపచ్చని, పసుపు రంగు అంటే ఎంతో ఇష్టం..ఈ రోజు అమ్మవారికి పూజించేవారు అమ్మవారి అనుగ్రహం పొందడానికి పూజలో భాగంగా అన్ని వస్తువులు ఆకు పచ్చని రంగు ఉండేవాటిని వినియోగించడం చాలా మంచిది. ఈ రోజు అమ్మవారికి పసుపుతో ప్రత్యేక పూజ చేయడం చాలా శుభప్రదమని పూర్వీకులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పూజలో పాల్గొనేవారు ఈ రంగు దుస్తువులను ధరించండి:
నవరాత్రులలో 4వ రోజు అమ్మవారి పూజలో పాల్గొనేవారు తప్పకుండా నలుపు రంగు దుస్తువులను ధరించడం చాలా మంచిది. మహిళలు కూడా నలుపు రంగు దుస్తువులు ధరించి కూష్మాండ అమ్మవారిని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. 

కూష్మాండ అమ్మవారి ప్రాముఖ్యత:
కూష్మాండ అమ్మవారు తన తల్లి గర్భం నుంచే ప్రపంచాన్ని పాలించింది. ఈ తల్లి మూడు తలలను కలిగి ఉంటుంది. అయితే జీవితాల్లో తీరని సమస్యలతో బాధపడేవారు ఈ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల అన్ని దూరమవుతాయి. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News