Naraka Chaturdashi 2022 Date Puja Vidhanam: దీపావళి పండుగను ఐదు రోజులు జరుపుకుంటారు. ఇందులో దీపావళి ముందు రోజు వచ్చే పండుగే నరక చతుర్దశి. దీనినే మినీ దీపావళి లేదా నరక్ చౌదాస్ మరియు రూప్ చతుర్దశి అని కూడా అంటారు. నరక చతుర్దశి పండుగను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు జరుపుకుంటారు. అయితే దక్షిణాధి రాష్ట్రాల్లో ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటారు. నరక చతుర్దశి నాడు కృష్ణపూజ, కాళీపూజ చేస్తారు. ఈ ఏడాది నరక చతుర్దశి పండుగను అక్టోబర్ 23న జరుపుకోనున్నారు.
హిందువులు నరక చతుర్దశి రోజున శ్రీకృష్ణుడిని పూజిస్తారు. దీనికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ఉంది. నరకాసురుడిని తన భార్య సత్యభామ సహాయంతో శ్రీకృష్ణుడు చంపుతాడు. నరకాసురుడిని సంహరించిన రోజే నరక చతుర్దశి. అందుకే ఈ రోజున చాలా చోట్ల శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.
శుభ ముహూర్తం
కార్తీక చతుర్దశి తిథి ప్రారంభం : అక్టోబర్ 23, 2022 సాయంత్రం 06:03 గంటలకు
కార్తీక చతుర్దశి తేదీ ముగింపు: అక్టోబర్ 24, 2022 సాయంత్రం 05:27 గంటలకు
కాళీ చౌదాస్ ముహూర్తం: అక్టోబర్ 23 రాత్రి 11:40 నుండి అక్టోబర్ 24 ఉదయం 12:31 వరకు
పూజ వ్యవధి : 00 గంటలు 51 నిమిషాలు
నరక చతుర్దశి పూజా విధానం
నరక చతుర్దశి రోజున స్నానం చేసిన తర్వాత ఇంట్లోని ఈశాన్య మూలలో పూజ చేయాలి. ఆరాధన సమయంలో పంచదేవతలైన సూర్యుడు, గణపతి, దుర్గ, శివ, విష్ణువుల ప్రతిమలు లేదా ఫోటోలు పెట్టండి. ఆ దేవతల ముందుగా ధూపం వేసి.. దీపం వెలిగించండి. షోడశోపచార పదార్ధాలతో పూజించండి. ఈ సమయంలో మంత్రాలను పఠించండి. అనంతరం దేవుళ్లకు నైవేద్యం పెట్టండి. ప్రధాన పూజ తర్వాత ప్రదోష కాలంలో యముడిని తలుస్తూ...ప్రధాన ద్వారం లేదా ప్రాంగణంలో దీపం వెలిగించండి. ఆ తర్వాత ఇంటి నలుమూలల దీపాలను పెట్టండి. ఇలా దీపం పెట్టడం వల్ల యమలోకం నుంచి విముక్తి నమ్ముతారు. అంతేకాకుండా స్వర్గలోకానికి దారి చూపిస్తాయని మరో కథ ప్రచారంలో ఉంది.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook