Nagula Chavithi Celebrations 2022: తెలుగు లోగిళ్లలో నాగుల చవితి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడి మెుదలైంది. భక్తులు పుట్టలో పాలు పోసేందుకు బారులు తీరుతున్నారు. నాగారాధన చేస్తూ భక్తులు తమ మెుక్కులను తీర్చుకుంటున్నారు. పుట్టలో చలిమిడి, ఆవు పాలు, పూలు, పళ్లు వేసి తమ భక్తిని చాటుకుంటున్నారు. పుట్ట వద్ద చిన్న పిల్లలు టపాసులు పేలుస్తూ సందడి చేస్తున్నారు. కొంత మంది ఈ వేడుకను ఇళ్లలో జరుపుకుంటూ ఉంటే.. మరికొందరు పుట్ట వద్ద చేసుకుంటున్నారు. మరోవైపు ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.
నాగుల చవితి రోజున నాగదేవతను (Nagadevata) ఆరాధించడం వల్ల జాతకంలో ఉన్న రాహు-కేతు దోషాలతోపాటు సర్పదోషం (Naga Dosham) తొలగిపోతుంది. ఈరోజున నాగదేవతను పూజించడం వల్ల సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. పెళ్లికాని యువతీయువకులు నాగారాధన చేస్తే వివాహం అవుతుందని నమ్ముతారు. నాగేంద్రుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు దాని నుండి బయటపడతారు. హిందూమతంలో దీపావళి తర్వాత వచ్చే పండుగలలో దీనికే అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ పండుగను తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక స్టేట్ లోని కొన్ని ప్రాంతాల్లో చాలా వైభవంగా జరుపుకుంటారు.
Also Read: Nagula Chavithi 2022: ఇవాళే నాగుల చవితి... శుభముహూర్తం, పూజా విధానం, విశిష్టత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి