Luck Zodiac Signs: రేపు 5 అద్భుతమైన యోగాలు.. క్రిస్మస్ నుంచి మారనున్న ఈ రాశుల ఫేట్..

Rajyog benefits: క్రిస్మస్ కు ముందు కొన్ని పవిత్రమైన యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాల వల్ల మూడు రాశులవారికి డబ్బుతోపాటు గౌరవం లభించనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2023, 08:00 PM IST
Luck Zodiac Signs: రేపు 5 అద్భుతమైన యోగాలు.. క్రిస్మస్ నుంచి మారనున్న ఈ రాశుల ఫేట్..

Luckiest Zodiac Signs in December 2023: రేపు అంటే డిసెంబరు 24న చంద్రుడు తన ఉచ్ఛరాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా శశి రాజ్యయోగం ఏర్పడుతోంది. పైగా ఆదివారం మార్గశీర్ష శుక్లపక్ష తిథి. దీనినే రవి ప్రదోష తిథి అని అంటారు. ఈ పవిత్రమైన రోజున కొన్ని శుభయోగాలు ఏర్పడుతున్నాయి. సధ్య యోగం, శుభ యోగం, రవియోగం, రోహిణి నక్షత్రం వంటివి ఏర్పడుతున్నాయి. ఈ రవి ప్రదోష వ్రతం 3 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

సింహరాశి
రవియోగం సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీరు లగ్జరీ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కెరీర్ లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలిస్తాయి. 
మిథునరాశి
రవి ప్రదోష వ్రతం కారణంగా మిథునరాశి వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ కంప్లీట్ అవుతాయి. క్రిస్మస్ మీకు అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ స్నేహితులతో సరదాగా గడపుతారు. 
కన్యా రాశి
కన్యారాశి వారికి సధ్య యోగం అద్భుతంగా ఉండబోతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. బంధువులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. మీ వివాహం కుదిరే అవకాశం ఉంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. కన్యా రాశి వారికి రేపటి నుంచి గుడ్ టైమ్ స్టార్ట్ అవుతుంది. 
 

Trending News