Money Plant Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ ను పెంచడం శుభప్రదంగా భావిస్తారు. దీనిని ఇంట్లో ఉంచితే మంచి జరుగుతుందని నమ్ముతారు. అందుకే చాలా మంది ఇళ్లలో ఈ మెుక్కను పెంచుకోవడానికి ఇష్టపడతారు. అయితే మనీ ఫ్లాంట్ (Money Plant Vastu Tips) సరైన ప్లేస్ లో ఉంచాలి. లేకపోతే దాని ప్రతికూల ప్రభావం కుటుంబంపై పడుతుంది. మనీ ప్లాంట్‌కి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఇంట్లో కాసుల వర్షం కురుస్తుందని వాస్తు నిపుణలు నమ్ముతారు.
మనీ ప్లాంట్ మొక్కను ఇలా నాటండి
>> మనీ ప్లాంట్ ఎల్లప్పుడూ సరైన దిశలో నాటాలి. ఆగ్నేయ దిశలో నాటడం వల్ల అది శుభ ఫలితాలను ఇస్తుంది. తప్పు దిశలో నాటితే అది ప్రతికూల ప్రభావాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది.
>> వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్‌ను నేరుగా ఎప్పుడూ నేలపై నాటకండి. దీనితో పాటు, దాని ఆకులు నేల వైపు పెరగనివ్వకుండా చూసుకోండి.
>> మనీ ప్లాంట్ ను శుభ్రమైన ప్రదేశంలో నాటితే ఆ ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది.
>> శుక్రవారం రోజు మనీ ప్లాంట్‌కు ఎర్రటి రిబ్బన్ లేదా దారం కట్టడం శుభప్రదమని వాస్తు నిపుణులు నమ్ముతారు. ఎరుపు రంగు కీర్తి మరియు పురోగతికి చిహ్నంగా భావిస్తారు.
Also Read: Skand Shashthi 2022: స్కంద షష్ఠి వ్రతం ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏమిటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి