Mercury Rise 2023: కొత్త ఏడాదిలో మెర్య్కూరీ రైజింగ్.. ఈ 3 రాశులవారికి ఊహించనంత ధనం..

Budh Rise 2023: కొత్త ఏడాదిలో బుధుడి యెుక్క ఉదయం కొన్ని రాశులవారి అదృష్టాన్ని మార్చనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2022, 10:45 AM IST
  • తెలివితేటలకు కారకుడు బుధుడు
  • ఇతడిని గ్రహాల రాకుమారుడి అని పిలుస్తారు
  • మెర్క్యూరీ ఉదయం ఈ రాశులకు శుభప్రదం
Mercury Rise 2023: కొత్త ఏడాదిలో మెర్య్కూరీ రైజింగ్.. ఈ 3 రాశులవారికి ఊహించనంత ధనం..

Budh Rise 2023: వ్యాపారం, వాక్కు, తెలివితేటలు మరియు సంపదకు కారకుడు బుధుడు. ఆస్ట్రాలజీలో మెర్య్కూరీని గ్రహాల యువరాజు అంటారు. ప్రస్తుతం బుధుడు ఆస్తమించాడు. వచ్చే జనవరి 12న బుధుడు ఉదయించనున్నాడు. బుధుడు అస్తమయం కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. కొత్త ఏడాదిలో బుధుడు (Budh Uday 2023) ఉదయించనున్నాడు. ఇది ఏయే రాశులవారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం. 

వృశ్చిక రాశి (Scorpio) - నూతన సంవత్సరంలో మెర్క్యూరీ ఉదయం వృశ్చికరాశివారికి ఆనందాన్ని ఇస్తుంది. మీరు కెరీర్ లో అపారమైన పురోగతిని సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ సమయం ఉద్యోగులకు, వ్యాపారులకు కలిసి వస్తుంది. ఆర్థికంగా మీరు బలపడతారు. 
కుంభం (Aquarius)- ప్రస్తుతం కుంభరాశి వారికి ఈ సమయం ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే బుధుడు ఉదయించగానే వీరికి మంచి రోజులు మెుదలవుతాయి. అన్ని సమస్యల నుండి బయటపడతారు. ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. మిమ్మిల్ని మానసిక సమస్యలతోపాటు ఆర్థిక సమస్యలు చుట్టిముడతాయి. ఆర్థిక విషయాల్లో లాభపడతారు. 
మీనం (Pisces)- బుధ గ్రహ సంచారం మీన రాశి వారికి వారి కెరీర్‌లో బలమైన ప్రయోజనాలను ఇస్తుంది. మీరు ఉద్యోగం మరియు వ్యాపారం రెండింటిలోనూ విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారస్తుల వ్యాపారాభివృద్ధికి ఇది అనుకూలమైన సమయం. ఆర్థికంగా మీరు మునుపటి కంటే బలపడతారు.

గ్రహాలు ఎలా అస్తమిస్తాయి?
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో రాశిని మారుస్తాయి. ప్రతి గ్రహం సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏ గ్రహమైనా సూర్యుడికి దగ్గరకు వచ్చిందంటే అది అస్తమిస్తుంది. అంతేకాకుండా ఆ గ్రహ ప్రభావం తగ్గుతుంది. 

Also Read: Shukra Gochar 2022: మకరరాశిలో శుక్ర సంచారం.. ఈ 5 రాశులవారి డబ్బు సంచులు నిండటం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News