Budh Gochar 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట కాలం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఈ గ్రహాల స్థానం మార్పు మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ఆగస్ట్ 21న బుధుడు బాల త్రయోదశి నాడు కన్యారాశిలోకి ప్రవేశించాడు. సెప్టెంబరు 10న బుధుడు అదే రాశిలో తిరోగమనం (Mercury retrograde in Virgo 2022) చేశాడు. కన్యారాశిలోనే బుధుడు 61 రోజులపాటు అంటే అక్టోబరు 26 వరకు ఉండనున్నాడు. ఇది మూడు రాశులవారిపై సానుకూల ప్రభావం చూపనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
సింహం (Leo): బుధ సంచారం సింహ రాశి వారికి మేలు చేస్తుంది. ఈ రాశి యొక్క రెండో స్థానంలో బుధుడు సంచరించనున్నాడు. ఆ స్థలం సంపద మరియు వాక్కు స్థానంగా పరగణిస్తారు. దీని కారణంగా ఈ రాశివారు భారీగా ధనాన్ని పొందుతారు. వ్యాపారులు పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. మెుత్తానికి ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది.
వృశ్చికం (Scorpio): బుధ సంచారం మీ వృత్తి మరియు వ్యాపారానికి లాభదాయకంగా ఉంటుంది. ఈరాశి యెుక్క పదకొండవ ఇంట్లోకి బుధుడు ప్రవేశిస్తాడు. ఈ స్థలం ఆదాయం మరియు లాభం యొక్క ఇల్లుగా భావిస్తారు. కాబట్టి ఈ సమయంలో మీ ఆదాయం భారీగా పెరుగుతుంది. రాజకీయాల్లో చురుకుగా ఉన్న వ్యక్తులు పెద్ద పదవిని పొందే అవకాశం ఉంది.
ధనుస్సు (Sagittarius): కన్యారాశిలో మెర్క్యురీ సంచారం ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి యెుక్క పదో ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ ప్రదేశం వ్యాపార మరియు ఉపాధి ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో మీకు కొత్త జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, జీతం పెరుగుతుంది. వ్యాపారం విస్తరిస్తుంది.
Also Read: Shani Margi 2022: అక్టోబరు 23న మార్గంలోకి శనిదేవుడు... శని ఆగ్రహం నుండి ఈ రాశులకు విముక్తి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook