Mercury Transit 2022: మరో వారం రోజుల్లో బుధుడు సంచారం... ఈ 3 రాశులకు ఆకస్మిక ధనప్రాప్తి...

Budh Gochar 2022: మరో వారం రోజుల్లో బుధుడు తన రాశిని మార్చనున్నాడు. దీంతో మూడు రాశులవారు అపారమైన ప్రయోజనాలు పొందుతారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2022, 10:21 AM IST
Mercury Transit 2022: మరో వారం రోజుల్లో బుధుడు సంచారం... ఈ 3 రాశులకు ఆకస్మిక ధనప్రాప్తి...

Mercury Transit in Libra 2022: అంతరిక్షంలో గ్రహాల రాశిచక్రం మార్పు అనేది చాలా కీలకమైనది. ఆస్ట్రాలజీలో గ్రహాల రాకుమారుడు బుధుడు ఈ నెల 26న తన రాశిని మార్చనున్నాడు. ప్రస్తుతం కన్యారాశిలో ఉన్న బుధుడు తులరాశిలోకి వెళ్లనున్నాడు. బుధుడు..మేధస్సు, తర్కం, వ్యాపారం మరియు కమ్యూనికేషన్ కు కారకుడు. బుధుడి రాశిలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. తులరాశిలో బుధుడి సంచారం (Budh Gochar 2022)  వల్ల కొన్ని రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.

బుధుడు సంచారం ఈ రాశులకు ప్రయోజనం
ధనుస్సు (Sagittarius)- బుధుడి రాశి మార్పు వల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. అదృష్టంతో మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఫ్యామిలీలో సంతోషం నెలకొంటుంది.
కన్యారాశి (Virgo)- తులారాశిలో బుధుని సంచారం కన్య రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. మతపరమైన విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఊహించని ధనలాభం ఉంటుంది. ఉద్యోగులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
కుంభం (Aquarius)- కుంభ రాశి వారికి బుధ సంచారం చాలా మేలు చేస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్ పొందవచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డబ్బు సంపాదించే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే అనుకూలమైన సమయం. వాహనం లేదా భవనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

Also Read: Surya Gochar 2022: తులరాశిలో సూర్యుడి సంచారం...ఏ రాశివారికి లాభం, ఏ రాశివారికి నష్టం? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News